Minister Jai Shankar on Deportation | మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయరు | ABP Desam
భారత్ కు అమెరికా నుంచి వచ్చిన అక్రమ వలసదారుల కాళ్లకు చేతులకూ సంకెళ్లు ఉండటంపై రాజ్యసభలో విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ క్లారిటీ ఇచ్చారు. అక్రమ వలసదారుల అప్పగింతల కార్యక్రమం అలానే ఉంటుందని క్లారిటీ ఇచ్చిన జై శంకర్...మహిళలు, చిన్నారులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని క్లారిటీ ఇచ్చారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి జై శంకర్ మాట్లాడుతూ " మనకు అమెరికాతో ఉన్న సత్సంబంధాల కారణంగానే మనం అక్రమ వలసదారులను మార్చుకోగలుగుతున్నాం. అమెరికాతో ఉన్న మిగిలిన ఒప్పందాల కంటే..మొబిలిటీ, మైగ్రేషన్ అంశాలపై ప్రత్యేక దృష్టి ఇరు దేశాలకు ఉంది. సక్రమ మార్గాల్లో విదేశాలకు వెళ్లటం, అక్రమ మార్గాల్లో విదేశీయానాన్ని నిరోధించటం లాంటి అంశాలను రెండు దేశాలు తమ అజెండాలో పెట్టుకున్నాయి. పైగా అక్రమమార్గాల్లో ఇలా వలసలు వెళ్లే వారు నేరపూరిత చర్యల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. అక్రమవలసదారులను స్వదేశాలకు పంపించేయటం కొత్తేం కాదు. అమెరికా నుంచి గత కొన్నేళ్లుగా అక్రమవలసదారులు భారత్ కు తిరిగి వస్తూనే ఉన్నారు. 2009 నుంచి ఉన్న డేటాను సభ ముందు పెడుతున్నాను " అన్నారు.





















