Sheikh Hasina Home Set on Fire | షేక్ హసీనా తండ్రి నివాసాన్ని తగులబెట్టిన ఆందోళనకారులు | ABP Desam
బంగ్లాదేశ్ లో అల్లరి మూకలు పేట్రేగిపోతున్నాయి. భారత్ లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ను రెచ్చగొట్టడానికి బంగ్లాదేశ్ లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. అందుకోసం బంగ్లాదేశ్ కు చారిత్రక చిహ్నమైన బంగ బంధు నివాసాన్ని తగులబెట్టేశారు ఆందోళనకారులు. ఆ నివాసంలో షేక్ హసీనా తండ్రి...బంగు బంధుగా పేరు తెచ్చుకున్న షేక్ ముజిబిర్ రెహ్మాన్ ఉండేవారు. 1975లో భారత్ సాయంతో పాకిస్థాన్ సైన్యం చేతుల్లో నుంచి విముక్తి సాధించి బంగ్లాదేశ్ కొత్త దేశంగా అవతరించింది. తూర్పు పాకిస్థాన్ కాస్తా బంగ్లాదేశ్ గా మారింది. అలాంటి వ్యక్తి నివసించిన స్మారక చిహ్నాన్ని తగులబెట్టేశారు ఆందోళనకారులు. పైగా ఇదంతా షేక్ హసీనా సోషల్ మీడియా ద్వారా అవామీ పార్టీ లీగ్ కార్యకర్తలతో ప్రసంగిస్తున్నప్పుడు చేశారు. ఘటన గురించి తెలుసుకున్న షేక్ హసీనా..మీరు భవనాన్ని కూల్చివేయగలరు కానీ చరిత్రను కాదు అని గుర్తుంచుకోవాలని కామెంట్ చేశారు. 1975లో ముజిబిర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన్ను అదే ఇంట్లో సైన్యం దాడి చేసి హత్య చేసింది. అప్పుడు షేక్ హసీనా జర్మనీలో ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత ఉన్న ఒక్క ఇంటినీ తగులబెట్టడంతో షేక్ హసీనా కార్యకర్తల ముందు ఎమోషనల్ అయ్యారు.





















