Game Changer OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' - ఈ ప్లాట్ ఫాంలో చూసి ఎంజాయ్ చేయండి
Game Changer OTT Platform: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అందాల కథానాయిక కియారా అడ్వాణి జంటగా నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

Ram Charan's Game Changer Now Streaming On Amazon Prime Video: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్' (Game Changer). దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా.. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. తొలి రోజు రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా, ఈ చిత్రం శుక్రవారం నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో (Amazon Prime) స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. మూవీని థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయాలని మేకర్స్ తెలిపారు. అటు, సంక్రాంతి బరిలో నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం', 'డాకు మహారాజ్' సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకోవడం.. 'గేమ్ ఛేంజర్' మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో అనుకున్నంత కలెక్షన్లు రాబట్టలేకపోయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
రామ్ చరణ్ నటనకు ఫిదా..
కాగా.. వినయ విధేయ రామ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ 'గేమ్ ఛేంజర్' మూవీలో రామ్ చరణ్‌తో జత కట్టింది. అంజలి మరో హీరోయిన్‌గా అలరించింది. విలన్‌గా ఎస్‌జే సూర్య తన నటనతో అదరగొట్టాడు. శ్రీకాంత్ , రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. రామ్ చరణ్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా '[గేమ్ ఛేంజర్' నిలిచింది. సినిమాలో ఓ ఐఏఎస్ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే, థమన్ పాటలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. విడుదలకు ముందే యూట్యూబ్‌లో మంచి వ్యూస్ సొంతం చేసుకోవడంతో పాటు సినిమాపై హైప్‌ను మరింత పెంచేశాయి. అయితే, థియేటర్లలో విడుదలైన తర్వాత నెల రోజుల ముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేయడం గమనార్హం.
పైరసీ దెబ్బ..
మరోవైపు, రిలీజైన కొద్ది రోజులకే ఈ మూవీ పైరసీ బారిన పడింది. బస్సులు, లోకల్ టీవీ ఛానెల్స్‌లోనూ ప్రసారం కావడం సైతం సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. దీనిపై మేకర్స్ సైబర్ క్రైమ్ పోలీసులను సైతం ఆశ్రయించారు. అయితే, 'గేమ్ ఛేంజర్' అవుట్ పుట్‌పై తాను సంతోషంగా లేనని డైరెక్టర్ శంకర్ తెలిపారు. తాను అనుకున్న ప్రకారం సినిమా 5 గంటల నిడివి వరకూ ఉండాలని.. మూవీ టైంకు ఉన్న ఆంక్షల కారణంగా పలు సీన్స్ కట్ చేయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
కథేంటంటే..?
రామ్ నందన్ (రామ్ చరణ్) కాలేజీలో తాను ప్రేమించిన అమ్మాయి దీపిక (కియారా అడ్వాణీ) కోసం తనలో కోపాన్ని తగ్గించుకుని వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. ఆమె సూచన మేరకు ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అధికారి అవుతాడు. ఈ క్రమంలోనే మంత్రి (ఎస్ జే సూర్య), అతని గ్యాంగ్‌తో యుద్ధం మొదలవుతుంది. తన తండ్రి సీఎం పదవి కోసం మంత్రైన కొడుకు ఎలాంటి ఎత్తులు వేశాడు.?. అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారిని తన అధికారంతో ఏం చేశాడు.?. రామ్ నందన్ మంత్రికి ఏం సమాధానం ఇచ్చాడు.? అభ్యుదయ పార్టీ పుట్టుక వెనుక ఉన్న కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరెందుకు ఆలస్యం 'అమెజాన్ ప్రైమ్' ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

