USA illegal Indian Migrants Aircraft | అమృత్ సర్ లో దిగిన విమానం వెనుక ఇంత కథ ఉంది | ABP Desam
అక్రమ వలసదారులను తమ దేశంలోనే ఉండనివ్వం అంటూ అధ్యక్షుడిగా వచ్చిన మొదటిరోజే ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్ అందుకు ఎవ్వరికీ మినహాయింపు ఇవ్వట్లేదు. అక్కడుంది భారత్ అయినా సరే..మోదీ తనకు ఎంత జాన్ జిగ్రీ దోస్త్ అయినా సరే అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయులను వెనక్కి పంపిస్తున్నారు ట్రంప్. అక్కడి వరకూ సంతోషం అనే అనుకోవాలి అట్లీస్ట్ ఎలాంటి జైలుశిక్షలు లేకుండా సేఫ్ గా వెనక్కి పంపిస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే...ఈ రోజు అమృత్ సర్ లో ఓ విమానం దిగింది. అది అమెరికాకు చెందిన సీ17 సైనిక విమానం. అందులో నుంచి 104 మంది భారతీయులు కిందకు దిగారు. ఆ విమానం వచ్చింది టెక్సాస్ నుంచి. అమెరికా ఎంబసీకి చెందిన ఓ అధికారి కూడా ఫ్లైట్ లో ఉన్నారు. ఫ్లైట్ లో వచ్చిన 104మంది అక్రమ వలసదారులే.
వీళ్లలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అందులో 30 మంది పంజాబ్‌కు చెందినవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో అత్యధికులు.. అమెరికా-మెక్సికో బోర్డర్ దగ్గర పట్టుబడిన వాళ్లే.





















