Vijayasai Reddy: మర్యాదపూర్వకంగా కూడా జగన్‌ను కలవని విజయసాయిరెడ్డి - ఇద్దరు ఆత్మీయుల మధ్య అంతగా చెడిందా ?
Jagan : జగన్ లండన్ లో ఉన్నప్పుడు రాజ్యసభకు రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఆయన వచ్చిన తర్వాత కలిసే ప్రయత్నం చేయలేదు. జగన్ కూడా ఆయనకు క్యారెక్టర్ లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

Vijayasai Reddy And Jagan: వ్యవసాయం చేసుకోవడానికి రాజకీయ సన్యాసం తీసుకున్న విజయసాయిరెడ్డి తాను జగన్ అనుమతి తీసుకున్నానని ప్రకటించారు. ఆయన తొందరపడవద్దని చెప్పారని అయినా తన నిర్ణయం మార్చుకోలేదన్నారు. జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత వైసీపీకి రాజీనామా చేస్తానని చెప్పారు. జగన్ ను ఓ సారి కలిసి తనకు ఎదురైన పరిస్థితుల్ని వివరించి పార్టీకి రాజీనామా చేస్తారని అనుకున్నారు. అయితే జగన్ లండన్ నుచి వచ్చినా విజయసాయిరెడ్డి అయనను కలవలేదు. దీంతో ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది.
విజయసాయిరెడ్డికి క్యారెక్టర్ లేదన్నట్లుగా జగన్ వ్యాఖ్యలు
గురువారం ప్రెస్ మీట్ పెట్టిన జగన్ విజయసాయిరెడ్డి రాజీనామాపై మీడియా అడిగిన ప్రశ్నలకు భిన్నంగా స్పందించారు. రాజకీయాల్లో క్యారెక్టర్ చాలా ముఖ్యమన్నారు. ప్రలోబాలకు , బెదిరింపులకు లొంగకూడదన్నారు. విజయసాయిరెడ్డికైనా ఇదే వర్తిస్తుందన్నారు. జగన్ అభిప్రాయం ప్రకారం.. బెదిరింపులకు, ప్రలోబాలకు విజయసాయిరెడ్డి లొంగిపోయారని ఆయనకు క్యారెక్టర్ లేదని జగన్ చెప్పినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయినా ఇంత కాలం ఆయన చేసిన సేవలకు గుర్తుగా కాసిని మంచి మాటలు జగన్ మాట్లాడి ఉంటే బాగుండేదని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ కు అత్యంత ఆత్మీయుడు విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి, జగన్ వేర్వేరు కాదని అనుకోవచ్చు. జగన్ మోహన్ రెడ్డి ఆర్థికంగా ఎదగడానికి విజయసాయిరెడ్డి చాలా కీలకంగా పని చేశారని అందరికీ తెలుసు. అందుకే ఆయన అక్రమాస్తుల కేసుల్లో ఏ 2గా ఉన్నారు. మొదట్లో ఆయన పూర్తిగా ఆర్థిక వ్యవహారాలకే పరిమితమయ్యేవారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ విస్తరణ దగ్గర నుంచి రాజకీయంగా ముఖ్యమంత్రిగా ఎదిగే వరకూ ప్రతి అడుగులోనూ విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి తెర వెనుక వ్యూహాలు మొత్తం విజయసాయిరెడ్డివేనని చెబుతున్నారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు జగన్ మొదటి సారిగా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది విజయసాయిరెడ్డినే. ఆ తర్వాతే గ్యాప్ పెరిగింది.
రాజీనామా చేయాల్సినంతగా గ్యాప్ ఎందుకు వచ్చింది ?
విజయసాయిరెడ్డి పదవికి రాజీనామా రాజకీయ సన్యాసం ప్రకటించారు. అది జగన్ లండన్ లో ఉన్నప్పుడు జరిగింది. అయితే పార్టీకి మాత్రం జగన్ వచ్చాక ఆయనతో మాట్లాడి ప్రకటించాలని అనుకున్నారు. అందుకే రాజ్యసభకు రాజీనామా చేసినా.. పార్టీకి మాత్రం జగన్ వచ్చే వరకూ రాజీనామా చేయలేదు. జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా ఓ సారి కావాలని విజయసాయిరెడ్డి అనుకున్నారని ఆ మేరకు బెంగళూరులో కలిసేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. కానీ జగన్ చాన్స్ ఇవ్వకపోవడంతో ఆయన ఆయన సోషల్ మీడియాలోనే వైసీపీకి కూడా రాజీనామా చేసినట్లుగా ప్రకటించారని అంటున్నారు. తనతో ఇంత కాలం ప్రయాణించి..తన ఎదుగుదల, పతనాల్లో వెంట ఉన్న విజయసాయిరెడ్డి ని కలిసేందుకు జగన్ ఇష్టపడకపోవడంతో ఏదో జరిగిందన్న అభిప్రాయం రావడానికి కారణం అవుతోందది. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఎవరికీ తెలియని వ్యవహారాలు చాలా జరిగాయని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

