Sonusood: నటుడు సోనూసూద్‌కు షాక్ - అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు
Ludhiana Court: రియల్ హీరో సోనూసూద్‌కు పంజాబ్ లూథియానా కోర్టు షాకిచ్చింది. ఓ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు రానందున అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.

Ludhiana Court Arrest Warrant Against Sonusood: ప్రముఖ నటుడు సోనూసూద్‌కు (Sonusood) పంజాబ్‌లోని లూథియానా కోర్టు షాక్ ఇచ్చింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి న్యాయస్థానానికి హాజరు కానందున అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ముంబయిలోని అందేరి వెస్ట్‌లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్‌కు లుథియానా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ ఈ వారెంట్ జారీ చేశారు. సోనూసూద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..?
లూథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనను మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు చెప్పారు. ఈ కేసులో సోనూసూద్‌ను సదరు న్యాయవాది సాక్షిగా పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం సోనూసూద్ సమాధానం చెప్పడానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోనూసూద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. 'సోనూసూద్‌కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలి.' అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీన జరగనుంది.
రియల్ హీరోగా..
కాగా, తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ సోనూసూద్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో 'అరుంధతి' సినిమాలో విలన్ రోల్‌లో 'పశుపతి'గా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సినిమాల్లో విలన్ రోల్స్ పోషించిన సోనూసూద్.. రియల్ లైఫ్‌లో సేవా కార్యక్రమాలతో అందరికీ దేవుడయ్యారు. కొవిడ్ సమయంలో ఆయన ధాతృత్వంతో చాలామందిని ఆదుకుని గొప్ప మనసు చాటుకున్నారు. అంతే కాకుండా 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్సులు అందించి ఉదారత చాటుకున్నారు. అంతే కాకుండా ఈ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం ఇలా అవసరం ఉన్న వారికి తన వంతు సాయం అందిస్తున్నారు ఈ రియల్ హీరో.
ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే సోనూసూద్ మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్‌గా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫతేహ్' పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సైబర్ మాఫియా కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించగా.. జాక్వెలైన్ ఫెర్నాండెజ్, సీరుద్దీన్ షా, విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

