Vivekanandan Viral OTT Streaming: ఓటీటీలోకి వివేకానందన్ వైరల్ - భార్యను పక్కనపెట్టి ఎఫైర్లు, ఐదుగురు హీరోయిన్లతో షైన్ టామ్ చాకో సినిమా
Vivekanandan Viralanu In Telugu: దసరా, దేవర సినిమాల్లో విలన్ రోల్స్ చేసిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గుర్తు ఉన్నారా? ఆయన హీరోగా నటించిన మాలీవుడ్ సినిమా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Shine Tom Chacko's Vivekanandan Viralanu OTT Telugu Streaming: మలయాళ హీరో షైన్ టామ్ చాకో తెలుసుగా! నాని 'దసరా', ఎన్టీఆర్ 'దేవర' సినిమాల్లో విలన్ రోల్స్ చేశారు. రీసెంట్ బాలకృష్ణ సినిమా 'డాకు మహారాజ్'లోనూ నటించారు. ఈ నటుడికి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. సాధారణంగా కనిపిస్తూ పవర్ ఫుల్ విలనిజం ఆయన స్టైల్. మలయాళంలో ఆయన నటించిన డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమా 'వివేకానందన్ విరలను' (Vivekanandan Viralanu).
తెలుగు ఓటీటీలోకి 'వివేకానందన్ వైరల్'గా!
షైన్ టామ్ చాకో కథానాయకుడిగా నటించిన మలయాళ సినిమా 'వివేకానందన్ విరలను'. లాస్ట్ ఇయర్ జనవరి 19న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఆ సినిమాను తెలుగులో 'వివేకానందన్ వైరల్'గా డబ్బింగ్ చేశారు. ఓటీటీలో రిలీజ్ చేశారు.
మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'వివేకానందన్ విరలను' సినిమాను 'వివేకానందన్ వైరల్'గా తెలుగు ఆడియన్స్ ముందుకు తెచ్చింది ఆహా ఓటీటీ (Aha OTT). ప్రతి శుక్రవారం వీక్షకులకు కొత్త సినిమాలు అందించే ఆహా ఓటీటీ ఈ శుక్రవారం ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాను తీసుకొచ్చింది. షైన్ టామ్ చాకో వందో చిత్రమిది. ఆహా ఓటీటీలో దీనిని భవానీ మీడియా సంస్థ ఈ రోజు (ఫిబ్రవరి 7) నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది.
షైన్ టామ్ చాకో సరసన ఐదుగురు హీరోయిన్లు
'వివేకానందన్ వైరల్' స్పెషాలిటీ ఏమిటంటే... ఈ సినిమాలో షైన్ టామ్ చాకో సరసన ఐదుగురు హీరోయిన్లు నటించారు. శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేష్, మంజు పిళ్లై... కథలో కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకు సీనియర్ దర్శకుడు కమల్ డైరెక్షన్ చేశారు.
Also Read: 'తండేల్' ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ అంత లేదు భయ్యా... మరి సెకండాఫ్? చైతూ సిన్మా టాక్ ఎలా ఉందంటే?
ఇక సినిమా కథ విషయానికి వస్తే... హీరో గవర్నమెంట్ ఉద్యోగి. అతడికి పెళ్లి అయ్యింది. చక్కటి భార్య ఉంది. అయితే మరొక మహిళతో సహ జీవనం చేస్తూ ఉంటాడు. భార్య ఉండగా ఎఫైర్ పెట్టుకున్నాడు. భార్య పల్లెటూరిలో ఉండటం, ఉద్యోగం సిటీలో కావడంతో ఇద్దరితో మొదట్లో ఎటువంటి సమస్య లేదు. అదీ కాకుండా హీరోకి లైంగిక పరమైన కోరికలు ఎక్కువ. వైఫ్, లివ్ ఇన్ పార్ట్నర్ కాకుండా ఇతర మహిళలతో సంబంధం పెట్టుకోవాలని, తన కోరికలు తీర్చాలని వేధిస్తుంటాడు. వివేకానందన్ కోరికలు, ఎఫైర్స్ గురించి తెలుసుకున్న మహిళలు, జనాలు ఏం చేశారు? అతడు ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? అతడి నిజ స్వరూపం ఎలా తెలిసింది? అనేది సినిమాలో చూడాలి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ జనాల్ని ఆకట్టుకుంది. ఓటీటీలో రిలీజ్ అయ్యాక మన తెలుగు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. తెలుగు ఆడియన్స్‌కు షైన్ టామ్ చాకో తెలియడం సినిమాకు ప్లస్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

