Allu Aravind: చిరుత ఏవరేజా... ఏంటిది అల్లు మామ? అప్పుడు కృతజ్ఞత... ఇప్పుడు మేనల్లుడి మీద ఎందుకీ అసూయ?
అల్లు అరవింద్ మాటలు, వ్యవహార శైలి మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. మేనల్లుడి విషయంలో మాటలు మారుస్తున్నారని, లెక్కలు - విజయాలు మారుస్తున్నారని చెబుతున్నారు. ఎందుకీ అసూయ అని ప్రశ్నిస్తున్నారు.

కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ స్పష్టంగా కనబడుతోంది. పైకి అంతా బావున్నట్టు ఉన్నప్పటికీ... లోపల ఏదో జరుగుతోందని భావిస్తున్నారంతా! మరీ ముఖ్యంగా అల్లు అరవింద్ మాటలు, వ్యవహార శైలి మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. మేనల్లుడి మీద మేనమామ అసూయతో ఉన్నారని అర్థం అవుతోందని, వసూళ్ల లెక్కలు - విజయాల్లో మాటలు మారుస్తున్నారని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు ఏమైంది? వివాదం ఎక్కడ మొదలైంది? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
'గేమ్ చేంజర్' మీద అల్లు అరవింద్ సెటైర్లు!
ఇటీవల 'తండేల్' ఈవెంట్‌లో 'ఈ మధ్య చరిత్ర సృష్టించిన దిల్ రాజు... ఒక సినిమాను కిందకు పడేసి, మరొక సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి, మళ్లీ ఇన్‌కమ్ ట్యాక్స్‌ను ఆహ్వానించి ఒక వారంలో రకరకాలు చేశాడు' అని అల్లు అరవింద్ మాట్లాడారు. ఆ మాటల్లో, చేతల్లో 'గేమ్ చేంజర్' కిందకు పడిందని అర్థం వచ్చింది. 'గేమ్ చేంజర్' సినిమాకు ఆశించిన వసూళ్లు రాలేదు. అయితే, ఫ్లాప్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అంత వెటకారం ఎందుకు? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఆహా టాక్ షో 'అన్‌స్టాపబుల్'లో 'చిరు, నాగబాబు, పవన్ - ముగ్గురిలో ఎవరితో పార్టీకి వెళ్తావ్' అని బాలకృష్ణ అడిగితే... 'ముగ్గరితో వెళ్ళను. మా మామతో వెళతాను' అని చెప్పారు రామ్ చరణ్. మేనమామకు గ్లోబల్ స్టార్ అంత ప్రేమ చూపిస్తే... ఆయన ఏమో మేనల్లుడి మీద సెటైర్స్ వేశారని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.
చిరుత ఏవరేజా? ఏంటిది అల్లు మామ?
'గేమ్ చేంజర్' మీద చేసిన కామెంట్స్ వేడి చల్లారక ముందు మరో కాంట్రవర్సీకి అల్లు అరవింద్ కారణం అయ్యారు. 'తండేల్' విడుదల సందర్భంగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ 'మగధీర' గురించి అల్లు అరవింద్ మాట్లాడారు. తన మేనల్లుడు హీరోగా పరిచయమైన 'చిరుత' ఏవరేజ్ హిట్ అవ్వగా... ఎలాగైనా భారీ హిట్ ఇవ్వాలని, నష్టాలకు సిద్ధపడి తాను ''మగధీర' ప్రొడ్యూస్ చేశానని, రాజమౌళిని దర్శకుడిగా తీసుకున్నానని చెప్పుకొచ్చారు.
చిరుత ఏవరేజ్ అనడం పట్ల మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు... టాలీవుడ్ మీడియా, ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఎందుకంటే... 'చిరుత' టోటల్ షేర్ వేల్యూ 25 కోట్లకు ఎక్కువే. ఆ ఏడాది (2007)లో విడుదలైన సినిమాల్లో హయ్యస్ట్ గ్రాసర్ ఆ సినిమాయే. అంతే కాదు... ఆ ఏడాది ఆఖరికి టాలీవుడ్ హయ్యస్ట్ గ్రాస్ సాధించిన సినిమాల్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. చాలా సెంటర్లలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దాన్ని అల్లు అరవింద్ ఏవరేజ్ అని ఎలా అంటారని విస్మయం వ్యక్తం చేశారు. 'చిరుత' కంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాల ఫస్ట్ (డెబ్యూ) మూవీ కలెక్షన్స్ తక్కువ అని టాలీవుడ్ ట్రేడ్ టాక్.
Some facts about #RamCharan's debut Chirutha:
— idlebrain.com (@idlebraindotcom) February 6, 2025
* Share: 25.23 Cr
* 2nd Highest Grosser of 2007.
* 8th Highest Grosser of All Time in TFI at that time
* ATR in many centres pic.twitter.com/f4mBC26Qsh
'దేశముదురు' కంటే 'చిరుత'కు ఎక్కువ కలెక్షన్స్!
'చిరుత' కంటే ముందు అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ హీరోగా 'దేశముదురు' తీశారు దర్శకుడు పూరి జగన్నాథ్. అప్పటికి 'ఆర్య' సెన్సేషనల్ యూత్ హిట్ కాగా, వీవీ వినాయక్ దర్శకత్వంలోని 'బన్నీ', కరుణాకరన్ 'హ్యాపీ' చేశారు అల్లు అర్జున్. పైగా, ఇండస్ట్రీ హిట్ 'పోకిరి' తర్వాత పూరి తీసిన సినిమా 'దేశముదురు'. ఆ సినిమా షేర్ 21 కోట్లు. 'చిరుత' కంటే నాలుగు కోట్ల షేర్ తక్కువ కలెక్ట్ చేసింది. అల్లు కాంపౌండ్ 'దేశముదురు' సూపర్ హిట్ అంటుంది. దాని కంటే తక్కువ కలెక్ట్ చేసిన 'చిరుత'ను ఏవరేజ్ అనడం ప్రేమా? అసూయా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.
అప్పుడు చిరంజీవికి కృతజ్ఞత... ఇప్పుడు ఏంటిలా?
'మగధీర' విడుదల సమయంలో అల్లు అరవింద్ మాట్లాడిన మాటల్ని మెగా ఫ్యాన్స్ మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. గత 20 ఏళ్లుగా గీతా ఆర్ట్స్ సంస్థలో చిరంజీవి గారు ఎన్నో హిట్స్ ఇచ్చారని, ఇప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థలో ప్రథమంగా చరణ్ వచ్చి సినిమా చేస్తున్నాడు కనుక ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తమ సంస్థకు ఎన్నో విజయాలు అందించిన చిరంజీవి పట్ల కృతజ్ఞతగా, లాభనష్టాలకు అతీతంగా గొప్ప సినిమా తీసి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నట్లు రాజమౌళితో చెప్పినట్లు అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన మాట మార్చారని మెగా ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు.
Naaku chiranjeevi gaaru enno hits ichaaru. Dhaaniki gratitude ga RC ki big movie ivvali nenu irrespective of losses or success.
— Joker (@JokerSpeakz) February 5, 2025
- AA about #Magadheera in 2009. pic.twitter.com/STx9j2R1u0
'మగధీర'ను తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల చేయడానికి నిర్మాత సుముఖత వ్యక్తం చేయలేదని, అందుకే 'ఈగ'తో ఇతర భాషల్లోకి అడుగు పెట్టినట్లు రాజమౌళి ఇచ్చిన వీడియోలు సైతం మెగా ఫ్యాన్స్ బయటకు తీశారు. మేనల్లుడి మీద ప్రేమ కంటే అసూయ ఎక్కువ కనబడుతోందని అల్లు అరవింద్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ సోషల్ మీడియాలో లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్.
SSR said this multiple times, only because of an incapable producer like #AlluAravind & @GeethaArts they couldn't release #Magadheera in other languages.@KChiruTweets & @AlwaysRamCharan Should've given a chance to some capable producer by keeping aside their family relations https://t.co/vBpwP6XKwc pic.twitter.com/gB4gRSaCJT
— R | RC16 - Beast Mode ON 🔥 (@CharanjeeviFan_) February 6, 2025





















