Advocate Serious on Hydra Ranganath | హైడ్రా కమిషనర్ పై చిందులేసిన అడ్వొకేట్ | ABP Desam
అమీన్ పూర్ పరిధిలోని ఐలాపూర్ రాజ్ గోపాల్ నగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఆక్రమణలు నిరోధించి తమ ప్లాట్లను కాపాడాలంటూ హైడ్రాకు మద్దతుగా అక్కడ ఆందోళన చేస్తున్న ప్లాట్ ఓనర్స్ తో రంగనాథ్ మాట్లాడారు. ఈలోగా అక్కడకు కొంత మంది స్థానికులతో చేరుకున్న అడ్వొకేట్ ముఖిం అనే వ్యక్తి పోలీసులతో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో వాగ్వాదానికి దిగాడు. ఒకానొక దశలో సుప్రీంకోర్టులో కేసు ఉంటే మీరెలా వస్తారంటూ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేయటంతో...హైడ్రా కమిషనర్ మీకు నచ్చిన చోట చెప్పుకోమంటూ సమాధానం ఇచ్చారు. కోర్టు ధిక్కరణ కింద తనపై కేసు వేసుకోవాలని అంతే కానీ పబ్లిక్ లో అరవొద్దని హెచ్చరించారు రంగనాథ్. పోలీసులు వారిస్తున్నా వినకుండా అడ్వొకేట్ హడావిడి చేస్తుండటంతో పోలీసులు అడ్వొకేట్ ను అక్కడి నుంచి తరలించారు. హైడ్రా ఉండేది కేవలం ప్రజల ను భవిష్యత్తులో ఆపదల కాకుండా చూసేందుకేనని హైడ్రా కమీషనర్ రంగనాథ్ మరో మారు స్పష్టం చేశారు.





















