Jeet Adani Wedding: గౌతమ్ అదానీ ఇంట మెగిన పెళ్లిబాజాలు, ఇంటివాడైన జీత్ అదానీ- ఏకంగా రూ.10,000 కోట్ల విరాళం
Gautam Adani Donates Rs 10000 crore | ప్రపంచ కుబేరులలో ఒకరైన భారత బిలియర్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం అహ్మదాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ రూ.10 వేల కోట్ల విరాళం ప్రకటించింది.

అహ్మదాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహ బంధంతో కొత్త జీవితం మొదలుపెట్టారు. జీత్ అదానీ, దివా షాల వివాహం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొంత మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో గుజరాతీ సాంప్రదాయంలో వధువు ఎవరంటే.. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి జైమిన్ షా కూతురు.
రూ.10,000 కోట్ల భారీ విరాళం
బిలియనీర్ గౌతమ్ అదానీ ఇంట పెళ్లి వేడుక అంటే ఎంతో గ్రాండ్‌గా, హంగూ ఆర్భాటాలతో జరుపుతారని భావించిన వారికి అదానీ ఫ్యామిలీ షాకిచ్చింది. ఆ కుటుంబ ఆదాయం, హోదాతో పోల్చితే ఎంతో సింపుల్‌గా, సాంప్రదాయ పద్ధతిలో చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం జరిపించారు. ఈ శుభ సందర్భంలో కీలక ప్రకటన చేసి గొప్ప మనసు చాటుకుంది అదానీ కుటుంబం. 10,000 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు గౌతమ్ అదానీ. గత నెలలో ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్న గౌతమ్ అదానీ తన కుమారుడి వివాహంపై ప్రకటించారు. సామాజిక సేవకు అవకాశం కల్పించేలా వేడుకను వేదికగా చేసుకుంటామని చెప్పారు అందులో భాగంగానే పది వేల కోట్లను సమాజ సేవకు వినియోగిస్తామంటూ భారీ విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రపంచ స్థాయిలో మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, కే-12 సూల్స్, మోడ్రన్ గ్లోబల్ స్కిల్ అకాడమిక్స్ వంటివి నిర్మిస్తామని అదానీ ఫ్యామిలీ పేర్కొంది.
यह अत्यंत हर्ष का विषय है कि मेरा बेटा जीत और बहू दिवा अपने वैवाहिक जीवन की शुरुआत एक पुण्य संकल्प से कर रहे हैं।
— Gautam Adani (@gautam_adani) February 5, 2025
जीत और दिवा ने प्रति वर्ष 500 दिव्यांग बहनों के विवाह में प्रत्येक बहन के लिए 10 लाख का आर्थिक सहयोग कर ‘मंगल सेवा’ का संकल्प लिया है।
एक पिता के रूप में यह ‘मंगल… pic.twitter.com/tKuW2zPCUE
2023లో నిశ్చితార్థం, శుక్రవారం వివాహం
అహ్మదాబాద్‌లోని అదానీ టౌన్‌షిప్‌లో గుజరాతీ సంప్రదాయంలో జీత్ అదానీ, దివా షాల వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు సెలబ్రిటీలను ఎవర్నీ ఆహ్వానించలేదని, కేవలం వ్యక్తిగత వేడుకగా నిర్వహించారని అదానీ బంధువులు తెలిపారు. ఎక్కువ మందిని కుమారుడి వివాహానికి ఆహ్వానించకపోవడంపై సారీ చెప్పారు గౌతం అదానీ. కుమారుడు, కోడలు పెళ్లి ఫొటోలను షేర్ చేసిన గౌతం అదానీ.. వారిని పెద్ద మనసుతో ఆశీర్వదించాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. 2023 మార్చిలో వీరి నిశ్చితార్థం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వేడుక ప్రారంభం కాగా, రాత్రి జీత్ అదానీ, దివా షాలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సంస్థ ఉద్యోగుల కోసం శనివారం రిసెప్షన్ నిర్వహించనున్నారు.
అదానీ పోర్ట్స్ డైరెక్టర్‌గా జీత్ అదానీ
వరుడు జీత్ అదానీ ప్రస్తుతం అదానీ పోర్ట్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. 6 అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తున్నారు. తాజాగా నవీ ముంబైలో 7వ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ స్కూల్ పూర్వ విద్యార్థి జీత్ అదానీ.
వివాహానికి 2 రోజుల ముందు 'మంగళ సేవా' అనే కార్యక్రమాన్ని గౌతమ్ అదానీ ప్రకటించారు. కొత్తగా వివాహం చేసుకునే దివ్యాంగ మహిళలకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఏడాది 500 మంది వికలాంగ మహిళలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని జీత్ అదానీ, గౌతం అదానీ ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ క్రమంలో జీత్ అదానీ 21 మంది కొత్తగా వివాహం చేసుకున్న దివ్యాంగులైన మహిళల్ని కలిశారు. జీత్, దివా తమ ప్రయాణంలో సేవతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారని గౌతం అదానీ హర్షం వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

