అన్వేషించండి

Top Headlines Today: నేడు టీడీపీ సత్యమేవ జయతే దీక్షలు - కడియం శ్రీహరి ఆసక్తికర కామెంట్స్- నేటి టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today

సత్యమేవ జయతే దీక్షలు 

టీడీపీ అధినేత  చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజు (అక్టోబర్‌ 2న) ఆయన కుటుంబం ఒక్కరోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సోమవారం నిరాహార దీక్ష చేయనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ మహాత్ముడి బాటలోనే శాంతియుతంగా నిరసన చేపడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తారు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బండారు అరెస్టుకు సిద్ధం 

ఏపీ పర్యాటక మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అనకాపల్లి పరవాడ మండలంలోని వెన్నెలపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. అటు టీడీపీ శ్రేణులు కూడా ఆయన ఇంటివద్దకు చేరుకుంటున్నాయి. దీంతో ఇరు వర్గాల మోహరింపుతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడుతోంది. 
ఆదివారం రాత్రి పది దాటిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని రౌండప్‌ చేశారు. అటువైపుగా ఎవర్నీ రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల మూమెంట్ చూసిన టీడీపీ శ్రేణులు, బండారు అభిమానులు ఒక్కొక్కరిగా అక్కడకు రావడం మొదలు పెట్టారు. అయితే వారెవర్నీ బండారు ఇంటివైపు రాకుండా పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. తమ లీడర్ ఇంటికి వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను టీడీపీ శ్రేణులు నిలదీయడం మొదలు పెట్టాయి.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ మంత్రి తాటికొండ రాజయ్యతో పోటీ పడి జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్ సొంతం చేసుకున్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. అయితే నాలుగు నెలల కిందటే ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేయవలసి వస్తుందని తనతో చెప్పారని కడియం శ్రీహరి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. దాంతో అధిష్టానం ముందుగానే రాజయ్యను సైడ్ చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. తాను చాలా కాలం తరువాత ఎన్నికల బరిలోకి దిగానని, ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మోదీకి కేటీఆర్ కౌంటర్

మహబూబ్ నగర్ లో నిర్వహించిన ప్రజా గర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు అని, అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్ ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రైతు బంధు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. నిజంగా మీరు ప్రధాని అయితే వెంటనే మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మోదీని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వైసీపీకి పవన్ వార్నింగ్ 

వైసీపీ పతనం మొదలైందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం జగన్ ఓడిపోవడం ఖాయమని, తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత తప్పిదాలు జరగనివ్వమని, ఓట్ల చీలిక రానివ్వమని అన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, మెగా డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామన్నారు. మద్యపాన నిషేధం నుంచి డీఎస్సీ వరకు జగన్ మాట తప్పారని, వైసీపీని గద్దె దించడమే జనసేన లక్ష్యమని తేల్చిచెప్పారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఇక్కడ మోడీ- మరి అక్కడెవరు?

సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. నరేంద్ర మోడీనే ప్రధాని అభ్యర్థని ఎన్టీఏ కూటమి తేల్చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ దిశగానే పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచే ఎన్నికల ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా బీజేపీ నేతృత్వంలోని కూటమి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వికెట్లు వెనుకా ముందు వీళ్లు చాలా డేంజర్

2023 వన్డే ప్రపంచ కప్‌లో చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు. వారి ప్రదర్శనను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ పండితులు గమనిస్తూనే ఉంటారు. ప్రపంచకప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో అందరి దృష్టి ఈ ఐదుగురు వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌లపైనే ఉంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రతికా ఔట్

బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగోవారం ఎలిమినేషన్ పూర్తయ్యింది. ముందు నుండి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. రతికనే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చేసింది. చివరిగా డేంజర్ జోన్‌లో టేస్టీ తేజ, రతిక ఉండగా.. రతిక ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించారు. దీంతో అసలు ఇది ఊహించలేదు అంటూ ఒక నిరాశతో హౌజ్‌లో నుండి స్టేజ్‌పైకి వచ్చింది రతిక. స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత తనకు అంతా కలలాగా ఉందని, ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని చెప్పింది. ఆ తర్వాత నాగార్జున.. కంటెస్టెంట్స్ అందరిలో నచ్చని ఒక్కొక్క లక్షణాన్ని చెప్పమని రతికతో అన్నారు. దీంతో ఎవరిపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో రతిక బయటపెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

'అయాలన్' దీపావళి 

కోలీవుడ్ లో రీసెంట్ గా 'మావీరన్'(తెలుగులో మహావీరుడు) సినిమాతో బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కలెక్ట్ కలెక్ట్ చేసి భారీ సక్సెస్ అందుకున్న హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో 'అయాలన్' ఒకటి. ఇందులో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆదరించేందుకు సిద్ధమవుతున్నాడు శివ కార్తికేయన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పూరి+రామ్ +మణిశర్మ 

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్'(Ismart Shankar) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రామ్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీస్ లో 'ఇస్మార్ట్ శంకర్' ముందు వరుసలో ఉంటుంది. ఇక ఈ సినిమా పాటలు అప్పట్లో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మణిశర్మ కంపోజ్ చేసిన మాస్ ఆల్బమ్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. రిలీజ్ కి ముందు సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అవ్వడానికి సాంగ్స్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. 'ఇస్మార్ట్ శంకర్' ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలవడంతో పాటు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Congress Vs BRS: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాల పేలుళ్లు - ఆటంబాబులు పేలుతాయా?
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాల పేలుళ్లు - ఆటంబాబులు పేలుతాయా?
Embed widget