News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంతసేపు ఒక టీమ్‌లాగా ఉన్నా వెళ్లిపోయేటప్పుడు మాత్రం రతికను అసలు పట్టించుకోలేదు శివాజీ.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగోవారం ఎలిమినేషన్ పూర్తయ్యింది. ముందు నుండి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. రతికనే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చేసింది. చివరిగా డేంజర్ జోన్‌లో టేస్టీ తేజ, రతిక ఉండగా.. రతిక ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించారు. దీంతో అసలు ఇది ఊహించలేదు అంటూ ఒక నిరాశతో హౌజ్‌లో నుండి స్టేజ్‌పైకి వచ్చింది రతిక. స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత తనకు అంతా కలలాగా ఉందని, ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని చెప్పింది. ఆ తర్వాత నాగార్జున.. కంటెస్టెంట్స్ అందరిలో నచ్చని ఒక్కొక్క లక్షణాన్ని చెప్పమని రతికతో అన్నారు. దీంతో ఎవరిపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో రతిక బయటపెట్టింది.

ముందుగా ప్రిన్స్ యావర్‌కు చాలా కోపం ఉందని, యాటిట్యూట్ ఉందని చెప్పుకొచ్చింది రతిక. ఆ విషయం అందరికీ తెలిసినా అది కొంచెం కంట్రోల్‌లో ఉంటే బాగుంటుందని రతిక చెప్పింది. అంతే కాకుండా ఈమధ్య యావర్.. మళ్లీ ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడని, కాస్త తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది. కంటెస్టెంట్స్ మీద కోపంతో యావర్.. ఫుడ్ వేస్ట్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ మరోసారి అలా చేయొద్దని చెప్పింది. శివాజీని అందరితో సమానంగా ఉండమని సలహా ఇచ్చింది. ఆయన ఆట సరిగానే ఆడుతున్నా.. అందరితో సమానంగా ఉండకపోవడం వల్ల పక్షపాతం చూపిస్తున్నట్టు అనిపిస్తుందని అలా చేయొద్దని చెప్పింది రతిక. కానీ రతిక అన్న మాటలను శివాజీ.. పెద్దగా పట్టించుకున్నట్టుగా అనిపించలేదు. రతిక ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోతున్నప్పుడు కూడా తనకు అసలు పలకరించాలని లేదని గౌతమ్‌తో చెప్పాడు శివాజీ.

సందీప్ విషయానికొస్తే.. సంచాలకుడిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని సలహా ఇచ్చింది రతిక. అంతే కాకుండా అలాంటి బాధ్యతలు ఇచ్చినప్పుడు యాక్టివ్‌గా ఉండమని చెప్పింది. శోభాని బేబీ అని పిలుస్తూ.. పనుల్లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండమని సలహా ఇచ్చింది రతిక. అంతే కాకుండా రెడీ అవ్వడంలోనే ఎక్కువగా సమయం కేటాయిస్తున్నావంటూ విమర్శించింది. కేవలం రెడీ అయ్యే విషయంలో మాత్రమే కాకుండా అన్నింటిలో యాక్టివ్‌గా ఉండమని చెప్పింది. టేస్టీ తేజను పిలిచి ఇంటి పనులు కూడా చేయమని తెలిపింది. అంటే కిచెన్‌లో పనులు చేయమని క్లియర్‌గా చెప్పింది. అంతే కాకుండా ఫ్రేమ్‌లో కనిపించడానికి ట్రై చేయమని సలహా ఇచ్చింది. శుభశ్రీ అయితే అవతల వాళ్లు ఏం చెప్పినా నమ్మేస్తుందని తనలో నచ్చని లక్షణాన్ని బయటపెట్టింది రతిక. అందుకే ఇప్పటినుండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని సలహా ఇచ్చింది. అవతలవాళ్లు చెప్పేది నిజమా, అబద్ధమా తెలుసుకోమని చెప్పింది.

బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత వరకు రతిక.. ఎక్కువగా పల్లవి ప్రశాంత్, శివాజీలతోనే క్లోజ్‌గా ఉండేది. కానీ ఓవారం నామినేషన్స్ తర్వాత పల్లవి ప్రశాంత్‌ను దూరం పెట్టింది. తాజాగా యావర్‌తో తనకు ఉన్న రిలేషన్‌షిప్‌పై కామెంట్స్ చేశాడని శివాజీని కూడా దూరం పెట్టడం మొదలుపెట్టింది రతిక. అంతే కాకుండా కంటెస్టెంట్స్ అంతా శివాజీకి సపోర్ట్ చేసినా తను మాత్రం అసలు సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు. దీంతో రతిక విషయంలో శివాజీ చాలా హర్ట్ అయ్యారు. ఒకప్పుడు తనను బిడ్డ, బిడ్డ అని ప్రేమగా పిలిచాను. ఎవరైనా తనను ఏమైనా అంటున్నా కూడా పోనీలే చిన్నపిల్ల అని సపోర్ట్ చేశాను అని రతిక బిగ్ బాస్ హౌజ్ నుండి వెళ్లిపోతున్నప్పుడు గుర్తుచేసుకున్నారు శివాజీ. ఇక ప్రశాంత్ కూడా కనీసం రతికను పలకరించడానికి దగ్గరకు కూడా వెళ్లలేదు.

Also Read: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 01 Oct 2023 11:13 PM (IST) Tags: Bigg Boss Nagarjuna Bigg Boss Telugu 7 Bigg Boss Telugu Season 7 Bigg Boss 7 Telugu Bigg Boss Telugu 2023 BB 7 Telugu Rathika sivaji

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: అమర్‌ను నామినేట్ చేసి షాకిచ్చిన ప్రియాంక, ఓటింగ్ ప్రక్రియను వివరించిన బిగ్ బాస్

Bigg Boss 7 Telugu: అమర్‌ను నామినేట్ చేసి షాకిచ్చిన ప్రియాంక, ఓటింగ్ ప్రక్రియను వివరించిన బిగ్ బాస్

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అందరినీ మోసం చేసే గుణం నీది, ఇదే నీ నిజస్వరూపం - అమర్‌పై ప్రశాంత్ ఫైర్

Bigg Boss 7 Telugu: అందరినీ మోసం చేసే గుణం నీది, ఇదే నీ నిజస్వరూపం - అమర్‌పై ప్రశాంత్ ఫైర్

Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్

Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్

Goutham: బయటికి వెళ్లిన తర్వాత ముందుగా శుభశ్రీతో మాట్లాడతా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన గౌతమ్

Goutham: బయటికి వెళ్లిన తర్వాత ముందుగా శుభశ్రీతో మాట్లాడతా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన గౌతమ్

టాప్ స్టోరీస్

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ

Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?

Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?
×