అన్వేషించండి
Repo Rate Cut: బ్రేకింగ్ న్యూస్ - రెపో రేట్ కట్ చేసిన రిజర్వ్ బ్యాంక్ - తగ్గనున్న వడ్డీ రేట్లు, EMIలు
RBI MPC RBI MPC Meeting Decisions: ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన మొదటి ద్రవ్య విధాన కమిటీ, రెపో రేటును 0.25 శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

రుణగ్రహీతలకు పెద్ద ఉపశమనం
Source : twitter
RBI MPC Meeting February 2025 Decisions: భారతీయ రిజర్వ్ బ్యాంక్, రుణగ్రహీతలకు పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది. రెపో రేటును నాలుగో వంతు తగ్గించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రెపో రేటు 0.25% లేదా 25 బేసిస్ పాయింట్లు (25 bps) తగ్గింది. దీంతో, రెపో రేట్ ప్రస్తుతం ఉన్న 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గుతుంది. కేంద్ర బ్యాంకు నిర్ణయం వల్ల గృహ రుణాలు, కారు రుణాలు, విద్యా రుణాలు, కార్పొరేట్ రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడానికి బ్యాంకులకు మార్గం సుగమం అయింది. RBI MPC ఫలితాలను కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI New Governor Sanjay Malhotra) ప్రకటించారు.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎలక్షన్
ప్రపంచం
మొబైల్స్
Advertisement





















