Shubman Gill about Being One Day Captain | వన్డే కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన ప్రిన్స్!
టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలిగించి ఆ భాద్యతలను శుబ్మన్ గిల్ కు అప్పగించారు. అయితే ఈ విషయంపై శుభమన్ గిల్ తొలిసారి స్పందించాడు. రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించి... వన్డే క్రికెట్ క్యాప్టిన్సి తనకు అప్పగిస్తున్నారన్న విషయం ముందే తెలుసనీ అన్నాడు గిల్. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆఫిసియల్ గా ప్రకటించే ముందు తనకు ఈ విషయం తెలుసంటూ శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు. “టెస్టు మ్యాచ్ మధ్యలోనే ఈ ప్రకటన వచ్చింది. నాకు ముందే సమాచారం ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద గౌరవం, అలాగే గొప్ప బాధ్యత కూడా. దేశాన్ని నడిపే అవకాశం రావడం ఏ ఆటగాడికైనా గర్వకారణమే” అని అన్నాడు.
రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ “రోహిత్ భాయ్ నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయనకు ఉన్న కామ్ నేచర్, అలాగే టీమ్ లో అందరితో స్నేహంగా ఉండే తీరు.. నాకు ఎంతో ప్రేరణగా ఉంటుంది. ఈ లక్షణాలను నేనూ కొనసాగించాలి అనుకుంటున్నాను” అని గిల్ చెప్పాడు.
ఇక మూడు ఫార్మాట్ల క్రికెట్ క్యాప్టిన్సి గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు సాధించిన విజయాలపై దృష్టి పెట్టడం కంటే, రాబోయే పోటీల్లో గెలవడంపైనే దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను” అని గిల్ స్పష్టంగా తెలిపాడు.





















