Richa Ghosh India vs South Africa ODI World Cup | రిచా ఘోష్ వన్ ఉమెన్ షో
ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన వన్ డే మ్యాచ్ లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. వరుసగా వికెట్లను కోల్పోతూ.. అల్ అవుట్ కి దేగ్గర్లోకి వెళ్ళింది టీమ్ ఇండియా. కానీ అప్పుడు క్రీజ్ లోకి వచ్చిన రిచా ఘోష్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఇండియాను కాపాడింది.
టాస్ గెలిచి సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ప్రతికా రావెల్, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 55 పరుగులు చేసారు. ఆ తర్వాత ఇండియా పతనం మొదలయింది. 102 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కొద్దీ సేపటి తర్వాత ఎనిమిదో స్థానంలో వచ్చిన రిచా ఘోష్ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ బౌండరీల మోత మోగించింది. స్నేహా రానా, రిచా ఘోష్ టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
రిచా ఘోష్ కేవలం 77 బంతుల్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగింది. ఆఖరి ఓవర్‌లో వరుస బౌండరీలు కొడుతూ.. భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయింది. 94 పరుగులు చేసి పెవిలియన్ చేరుకుంది. టీమిండియా 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.





















