India vs West Indies 2nd Test Preview | వెస్టిండీస్ తో భారత్ ఢీ
వెస్టిండీస్ తో ఇండియా రెండో టెస్టు ఆడనుంది. ఇప్పటికే తొలి టెస్ట్ ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది. 1987 నుంచి ఇక్కడ ఇండియా ఓడిపోలేదు.
తొలి టెస్టులో భారత్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. ముగ్గురు బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా సెంచరీలతో సత్తా చాటారు. రెండో టెస్ట్ లో భారత బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రాహుల్ ఆడతారు. మూడో నెంబర్లో సాయి సుదర్శన్ చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి. నాలుగో నెంబర్లో కెప్టెన్ శుభమాన్ గిల్... జురేల్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు.
జడేజా అటు బ్యాట్, ఇటు బంతితో రాణిస్తున్నాడు. మరో అల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ సత్తా చాటుతున్నాడు. ఈ మ్యాచ్ లో నితీశ్ కుమార్ మ్యాజిక్ చేయాల్సిన అవసరం ఉంది. బుమ్రాకు రెస్ట్ ఇచ్చి, ప్రసిధ్ కృష్ణను ఆడించొచ్చు. ఈ మ్యాచ్ లో నితీశ్ లేదా కుల్దీప్ కు రెస్ట్ ఇచ్చి, అక్షర్ పటేల్ ను ఆడించే అవకాశం కూడా ఉంది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమవుతున్న విండీస్ ఈ మ్యాచ్ కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.





















