Top 5 Wicket Keepers: 2023 ప్రపంచకప్‌లో డేంజరస్ వికెట్ కీపర్లు వీరే - టాప్-5 లిస్ట్‌లో ఎవరున్నారు?
త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచ కప్‌లో డేంజరస్ వికెట్ కీపర్ బ్యాటర్లు వీరే.

Top 5 Wicket Keeper 2023 ODI World Cup: 2023 వన్డే ప్రపంచ కప్‌లో చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు. వారి ప్రదర్శనను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ పండితులు గమనిస్తూనే ఉంటారు. ప్రపంచకప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో అందరి దృష్టి ఈ ఐదుగురు వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌లపైనే ఉంది.
1. కేఎల్ రాహుల్
భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఈ ప్రపంచకప్‌లో అతని జట్టుకు ప్రధాన బలం. ప్రపంచకప్‌లో రాహుల్ ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఆసియా కప్‌లో జట్టులోకి తిరిగి వచ్చిన కేఎల్ రాహుల్ పాకిస్తాన్‌పై సెంచరీ చేయడం ద్వారా తన ఫాం చెక్కుచెదరలేదని నిరూపించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ ఎన్నో భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. అలాగే జట్టును ఒంటరిగా విజయతీరాలకు చేర్చగలడు.
2. క్వింటన్ డి కాక్
2023 వన్డే ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకనున్నాడు . వన్డేల్లో మెరుపు బ్యాటింగ్‌కు కూడా క్వింటన్ డి కాక్ పేరుగాంచాడు. ఇది డి కాక్‌కి చివరి ప్రపంచ కప్. ఈ టోర్నమెంట్ తర్వాత అతను దేశం తరఫున వన్డే ఫార్మాట్‌లో కనిపించడు. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపు అతని పెర్ఫార్మెన్స్ పైనే పడనుంది.
3. మహ్మద్ రిజ్వాన్
పాకిస్థాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ వైట్ బాల్ క్రికెటర్లలో ఒకడు. అతను చాలా బిజీ ప్లేయర్. మహ్మద్ రిజ్వాన్ క్రమం తప్పకుండా పరుగులు చేయడంలో పేరుగాంచాడు. ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్‌కు మహ్మద్ రిజ్వాన్ వెన్నెముక. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా రిజ్వాన్ ప్రపంచకప్‌లో ఎలాంటి స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తాడో అందరికీ క్లారిటీ ఇచ్చాడు.
4. జోస్ బట్లర్
ఇంగ్లండ్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ వన్డే ఫార్మాట్‌లో ప్రధానమైన బ్యాటర్. ఏ ఆర్డర్‌లోనైనా బ్యాటింగ్ చేయడంలో బట్లర్ నిష్ణాతుడు. దీంతో పాటు అతను తన తుఫాను బ్యాటింగ్‌తో ఎలాంటి బౌలింగ్ దాడినైనా నాశనం చేయగలడు. ఈసారి ప్రపంచకప్‌లో అత్యధిక బ్యాటింగ్ ట్రాక్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపు బట్లర్ తుపాను బ్యాటింగ్‌పైనే ఉంటుంది.
5. లిట్టన్ దాస్
బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు ప్రధాన బలం వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ లిట్టన్ దాస్. దాస్ ఓపెనింగ్ చేసి ప్రారంభం నుంచే వేగంగా పరుగులు చేయడంలో నిపుణుడు. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ రాణించాలంటే లిట్టన్ పరుగులు చేయడం తప్పనిసరి.
R Ashwin replaces injured Axar Patel in the 15-member squad.
— BCCI (@BCCI) September 28, 2023
We wish Axar a speedy recovery 👍 👍#TeamIndia's final squad for the ICC Men's Cricket World Cup 2023 is here 🙌#CWC23 pic.twitter.com/aejYhJJQrT
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

