News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

కోలీవుడ్ హీరో శివ కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అయలాన్'. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీ టీజర్ ని అక్టోబర్ 6న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

కోలీవుడ్ లో రీసెంట్ గా 'మావీరన్'(తెలుగులో మహావీరుడు) సినిమాతో బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కలెక్ట్ కలెక్ట్ చేసి భారీ సక్సెస్ అందుకున్న హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో 'అయాలన్' ఒకటి. ఇందులో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆదరించేందుకు సిద్ధమవుతున్నాడు శివ కార్తికేయన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.

శివ కార్తికేయన్ ఆకాశంలో విహరిస్తుండగా, అతనితో పాటు ఏలియన్ కూడా వెళుతున్న లుక్ ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే, ఈ చిత్ర టీజర్ ని అక్టోబర్ 6న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు కోలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో చూపించబోతున్నారట. మొదట్లో ఈ చిత్రాన్ని 2023 దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ సీజీ వర్క్ లో జరిగిన జాప్యం వల్ల నిర్మాతలు సినిమా విడుదలను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక సంఖ్యలో సీజీ షాట్స్ 'అయలాన్' కోసం మేకర్స్ ఉపయోగించినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ తరహాలో ఈ సినిమా అవుట్ ఫుట్ ఉండనున్నట్లు చెబుతున్నారు. అప్పట్లో బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ నటించిన 'కోయి మిల్ గయా'(Koi Mil Gaya) సినిమా తరహాలోనే ఈ చిత్రం ఉంటుందని కొందరు చెబుతున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సినిమాలో శివ కార్తికేయన్ మరోసారి డిఫరెంట్ అవతారంలో కనిపించబోతున్నారు. శరత్ కేల్కర్, ఈశా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు.

కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్ పై జే రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాతోపాటు రాజ్ కుమార్ పెరియార్ సామి దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శివ కార్తికేయన్. 'SK 21' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ మూవీలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా  నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని కోలీవుడ్ సీనియర్ హీరో కమలహాసన్ రాజ్ కమల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : 'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 01 Oct 2023 07:51 PM (IST) Tags: Sivakarthikeyan Ayalaan Movie Ayalaan teaser Sivakarthikeyan’s Ayalaan Ayalaan Movie Teaser

ఇవి కూడా చూడండి

Gutka Advertisements: బాలీవుడ్ స్టార్స్‌కు అలహాబాద్ హైకోర్టు షాక్, గుట్కా కేసులో ముగ్గురికి నోటీసులు

Gutka Advertisements: బాలీవుడ్ స్టార్స్‌కు అలహాబాద్ హైకోర్టు షాక్, గుట్కా కేసులో ముగ్గురికి నోటీసులు

Tripti Dimri - Sara Ali Khan: 'యానిమల్'లో సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో కూతురు? - అసలు నిజం ఏమిటంటే?

Tripti Dimri - Sara Ali Khan: 'యానిమల్'లో సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో కూతురు? - అసలు నిజం ఏమిటంటే?

Rashmika Mandanna: అభిమానితో వీడియో కాల్ మాట్లాడిన రష్మిక - 'యానిమల్'లో నటనకు బిగ్ బి ప్రశంసలు

Rashmika Mandanna: అభిమానితో వీడియో కాల్ మాట్లాడిన రష్మిక - 'యానిమల్'లో నటనకు బిగ్ బి ప్రశంసలు

Vidyut Jamwal: హిమాలయాల్లో నగ్నంగా తిరుగుతున్న స్టార్ హీరో - ప్రతి ఏడాదీ 10 రోజులు ఇలా న్యూడ్‌గా

Vidyut Jamwal: హిమాలయాల్లో నగ్నంగా తిరుగుతున్న స్టార్ హీరో - ప్రతి ఏడాదీ 10 రోజులు ఇలా న్యూడ్‌గా

Roshan Kanakala:సుమ, రాజీవ్ కనకాల విడాకులపై కుమారుడు రోషన్ కామెంట్స్ - ఓపెన్‌గా చెప్పేసిన యంగ్ హీరో

Roshan Kanakala:సుమ, రాజీవ్ కనకాల విడాకులపై కుమారుడు రోషన్ కామెంట్స్ - ఓపెన్‌గా చెప్పేసిన యంగ్ హీరో

టాప్ స్టోరీస్

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి

ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

Telangana Power Politics :  తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు -  సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?