By: ABP Desam | Updated at : 02 Oct 2023 08:49 AM (IST)
గాంధీ జయంతి రోజు నిరాహార దీక్ష
Chandrababu Family Fasting:
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజు (అక్టోబర్ 2న) ఆయన కుటుంబం ఒక్కరోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సోమవారం నిరాహార దీక్ష చేయనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ మహాత్ముడి బాటలోనే శాంతియుతంగా నిరసన చేపడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్ అక్కడి నుంచే ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తారు.
టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో లోకేశ్ దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు దీక్షకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నారా లోకేష్ తో పాటు ఈ దీక్షలో టీడీపీ పలువురు ఎంపీలు పాల్గొనబోతున్నట్లు సమాచారం. న్యాయం కోసం పోరాడే వాళ్లంతా తమకు మద్దతు తెలిపాలని లోకేష్ కోరారు. అక్రమంగా కేసులు బనాయించి ప్రజలకు మేలు చేసిన వారికి జైల్లో పెడతారనే భయం మొదలైతే ఎవరూ రాజకీయాల్లోకి వచ్చేందుకు సాహసం చేయరన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. రాజమండ్రిలోని రేణుక రెసిడెన్సీలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపడతారు. అయితే దీక్ష ప్రారంభానికి ముందు భువనేశ్వరి మీడియాతో మాట్లాడనున్నారు. తమ దీక్షకు కారణం చెబుతూ, ఇలాంటి దీక్ష ఎందుకు అవసరమో భువనేశ్వరి వివరించారు.
టీడీపీ శ్రేణులు సైతం దీక్ష..
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
పార్టీ అధినేత చంద్రబాబు ఒక్కరోజు దీక్షకు టీడీపీ నేతలు, ఆయన మద్దతుదారులు మద్దతు తెలిపారు. చంద్రబాబుకు సంఘీభావంగా పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షకు రెడీ అవుతున్నారు. అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా తమ నేతను అన్యాయంగా కేసుల్లో ఇరికించి వేధింపులకు గురిచేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ అక్టోబరు 3 వాయిదా
చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సీజేఐ బెంచ్ మంగళవారానికి (అక్టోబరు 3) వాయిదా వేసింది. అక్టోబరు 3న పిటిషన్ కి సంబంధించి అన్ని విషయాలు వింటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. తొలుత ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం వద్దకు వెళ్లగా.. జస్టిస్ భట్టి ఈ పిటిషన్ పై వాదనలు వినడానికి ఒప్పుకోని సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేయాలని సీజేఐ వద్ద మెన్షన్ చేశారు.
లోకేష్ కు నోటీసులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు జారీ చేశారు. 14వ తేదీన ఉదయం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇటీవల ఏ 14గా లోకేష్ పేరు చేర్చారు. అయితే తర్వాత ఎఫ్ఐఆర్ మార్చామని హైకోర్టుకు చెప్పారు.. ఎలా మార్చారు.. సాక్షిగా మార్చారా లేకపోతే.. నిందితుడిగానే ఉంచారా అన్నదానిపై స్పష్టత లేదు.
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Rajahmundry Airport: రూ.347 కోట్లతో రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులు: మార్గాని భరత్
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ
Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి
/body>