Sri Lankan National Killed: మూక దాడులకు 'పాపి'స్థాన్ అడ్డా.. ఇదే చివరి అవకాశం బిడ్డా!

పాకిస్థాన్‌లో శ్రీలంక జాతీయుడిపై మూకదాడి చేసి సజీవ దహనం చేసిన ఘటనపై ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ మాత్రం తప్పు చేశాక ఎప్పుడూ చెప్పే మాటలే మళ్లీ చెబుతోంది.

FOLLOW US: 

'నయా పాకిస్థాన్'.. ఇది పాకిస్థాన్ ప్రధానిగా అధికారం చేపట్టినప్పుడు ఇమ్రాన్ ఖాన్ చెప్పిన మాట. అయితే ఇమ్రాన్ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి పాకిస్థాన్ గతి మరింత దారుణంగా తయారైంది. భారత్‌పై దాడులకు పాల్పడి మన చేతిలో ఘోర పరాజయాలు చూసింది ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్. దేశాన్ని నడిపేందుకు డబ్బులు లేక అప్పుల పాలైంది. మరోవైపు దేశంలో మూకదాడులు, మైనార్టీలపై హత్యలు పెరిగిపోయి ప్రపంచదేశాల దృష్టిలో మరింత దిగజారింది.

ఇక ఇటీవల పాకిస్థాన్‌లో శ్రీలంక జాతీయుడ్ని అత్యంత కిరాతకంగా గాయపరచి, సజీవదహనం చేసిన ఘటన యావత్ ప్రపంచాన్నే షాక్‌కు గురిచేసింది. అసలు అతను చేసిన తప్పేంటి? ఒకవేళ నిజంగా తప్పు చేస్తే ఇలా సజీవదహనం చేసేస్తారా? అసలు పాకిస్థాన్‌లో నివసించే విదేశీయులకు రక్షణ ఉందా?

దారుణ ఘటన..

శ్రీలంకలోని క్యాండీకి చెందిన దియావదన (40) అనే వ్యక్తి లాహోర్‌కు 100 కిమీ దూరంలో ఉన్న సియాల్‌కోట్​లో ఉంటున్నారు. అక్కడ ఉన్న ఓ వస్త్ర పరిశ్రమలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆయన దైవదూషణ చేశాడన్న ఆరోపణలతో కోపోద్రిక్తులైన ఇస్లామిస్ట్ పార్టీ మద్దతుదారులు కొందరు కర్మాగారంపై దాడి చేశారు. ఆయన్ను తీవ్రంగా కొట్టి సజీవ దహనం చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనను శ్రీలంక, భారత్ సహా వివిధ దేశాలు తీవ్రంగా ఖండించాయి.  అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' కూడా ఈ ఘటనను ఖండించింది. 

పోస్టర్ చించినందుకా?

పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఇస్లామిస్ట్ పార్టీ 'తెహ్రీక్​-ఎ-లబ్బాయిక్ పాకిస్థాన్​(టీఎల్​పీ)' మద్దతుదారులే దియావదనను హత్య చేసినట్లు తెలుస్తోంది. దియావదన పనిచేసే కార్యాలయానికి దగ్గర్లోని గోడలకు టీఎల్​పీ పోస్టర్లను అతికించాగా.. వీటిని ఆయన చించి చెత్తబుట్టలో పడేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని ఫ్యాక్టరీలోని కార్మికులు చూసి టీఎల్​పీ కార్యకర్తలకు చెప్పారు.

దీంతో వందల సంఖ్యలో జనాలు రోడ్లపైకి చేరారు. దియావదనను ఫ్యాక్టరీ నుంచి బయటకు తీసుకొచ్చి తీవ్రంగా హింసించారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే సజీవ దహనం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి 100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.

పోస్ట్ మార్టం..

దియావదన పోస్ట్‌ మార్టం రిపోర్టులో అతడ్ని ఘోరంగా హింసించి, కర్రలు, రాడ్లతో దాడి చేసి అనంతరం సజీవ దహనం చేసినట్లు తేలింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ప్రపంచ దేశాలు స్పందించడంతో పాకిస్థాన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హామీ ఇచ్చారు. 

కొత్తే కాదు?

ముస్లిం మెజారిటీ దేశమైన పాక్​లో మానవ హక్కులు తరచుగా ఉల్లంఘనకు గురవుతున్నాయని హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దైవదూషణ ఆరోపణలు హిందువులు, క్రైస్తవులు వంటి మైనారిటీలపై ఎక్కువగా హింసను ప్రేరేపిస్తున్నాయని అంతర్జాతీయంగా సంస్థలు నివేదించాయి. ఇటీవలి సంవత్సరాల్లో దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. అయితే తప్పు జరిగాక సింపుల్‌గా చింతిస్తున్నామని చెప్పడం పాకిస్థాన్‌కు కొత్తేం కాదు. కానీ ఇలాంటి తప్పు మళ్లీ జరగకుండా చూడటమే ఈ సమస్యకు పరిష్కారం. మరి పాకిస్థాన్ ఇప్పటికైనా మారుతుందా? లేకపోతే ప్రపంచదేశాలు ఏదో రోజు పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పక తప్పదు.

Also Read: Omicron Threat: ఈ 'చిత్రం' చూశారా? ఇది మార్కెట్టా.. ఎయిర్‌పోర్టా.. లేక వైరస్ హాట్‌స్పాటా?

Also Read: India-Russia Summit: భారత్- రష్యా మధ్య 4 ఒప్పందాలు.. అమేఠీలో 6 లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి ఓకే

Also Read: Nagaland Firing: 'వాహనం ఆపమంటే ఆపలేదు.. అందుకే సైన్యం కాల్పులు జరిపింది'

Also Read: Punjab Election 2022: భాజపాతో కెప్టెన్ దోస్తీ.. పంజాబ్ ఎన్నికల బరిలో కలిసే పోటీ

Also Read: Nagaland firing incident Update: నాగాలాండ్‌లో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోండి: కేంద్ర హోంశాఖను కోరిన సీఎం

Also Read: Nagaland Civilian Killings: నాగాలాండ్ కాల్పుల ఘటనపై మోదీ భేటీ.. పార్లమెంటులో అమిత్ షా ప్రకటన

Also Read: Allahabad High Court: 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 06 Dec 2021 06:32 PM (IST) Tags: Pakistan Sri Lanka mob lynching Tehreek-e-Labbaik Pakistan Sri Lankan national lynched

సంబంధిత కథనాలు

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Breaking News Live Updates : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Breaking News Live Updates : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం

Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి