By: ABP Desam | Published : 06 Dec 2021 12:57 PM (IST)|Updated : 06 Dec 2021 01:00 PM (IST)
Edited By: Murali Krishna
కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు: అల్‌హాబాద్ హైకోర్టు
కూతురి కంటే ఇంటికి వచ్చిన కోడలికే కుటుంబంలో ఎక్కువ హక్కులు ఉంటాయని అల్‌హాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కోడలు లేదా విధవైన కోడలిని కుటుంబంలో చేరుస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంలో 2019 ఆగస్టు 5న ఇచ్చిన తీర్పులో కూడా మార్పులు చేయాలని పేర్కొంది.
ఉత్తర్‌ప్రదేశ్ నిత్యవసర వస్తువుల (ఉత్పత్తి, పంపిణీ, ధరల నిర్ధరణ) చట్టం 2016లో ఇంటికి వచ్చే కోడలిని కుటుంబ సభ్యురాలిగా పేర్కొనలేదు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కోడలు.. కుటుంబంలో సభ్యురాలు కాదని ఆదేశాలిచ్చింది. దీని వల్ల ఇంటికి వచ్చే కోడలు తన హక్కులు కోల్పోతుందని హైకోర్టు అభిప్రాయపడింది.
నిజానికి కన్న కూతురి కంటే కోడలు లేదా విధవైన కోడలికే కుటుంబంలో ఎక్కువ హక్కులు ఉంటాయని అల్‌హాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇంటికి వచ్చిన కోడలు విధవైన లేకపోయినా తనకు కూతురు (విడాకులు తీసుకున్నా లేదా విధవైనా) కంటే ఎక్కువ హక్కులు ఉంటాయని హైకోర్టు తెలిపింది.
ఇదే కేసు..
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పుష్పా దేవి అనే మహిళ భర్త చనిపోగా తన అత్త మహాదేవితోనే ఉండేది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. మహాదేవి పేరు మీద ఓ రేషన్ షాపు ఉండేది. అయితే పుష్పా దేవి అత్త మహాదేవి ఇటీవల చనిపోయింది. దీంతో ఆ రేషన్ షాపును తనకు కేటాయించాలని పుష్పాదేవి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. అయితే పుష్పాదేవి.. మహాదేవి వారుసురాలు కాదని 2019, ఆగస్టు 5న ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పేర్కొంటూ ఆమెకు రేషన్ షాపు కేటాయించేందుకు నిరాకరించింది.
దీంతో బాధితురాలు అల్‌హాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేసిన హైకోర్టు.. కన్న కూతురి కంటే కోడలికే కుటంబంలో ఎక్కువ హక్కులు ఉంటాయని, ఆమెకు రేషన్ షాపు కేటాయించాలని ఆదేశాలిచ్చింది. ఇందుకోసం సదరు చట్టంలో మార్పులు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి తెలిపింది.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Breaking News Live Updates: క్షేమంగానే ఉన్నాను, ఆధారాలతో వస్తున్నాను: నటి కరాటే కళ్యాణి
Ukraine Winner : యుద్ధంలో విన్నర్ ఉక్రెయిన్ - డిసైడయ్యేది ఎప్పుడంటే ?
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న
Janasena On CM Jagan : రైతులను కులాల పేరిట విభజించిన ఘనత వైసీపీదే, చిత్తశుద్ధి ఉంటే ఆ నిబంధన తొలగించండి : నాదెండ్ల మనోహర్
Mysterious metal balls raining : గుజరాత్లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !
NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్‌డేట్ వస్తుందా?
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !
Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?
Samsung Galaxy F23 5G Copper Blush: రూ.15 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!