By: ABP Desam | Updated at : 28 Nov 2021 09:00 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
మనం డ్రైవ్ చేసేటప్పుడు ధ్రువపత్రాలు తీసుకెళ్లడం కూడా ఎంతో ముఖ్యమైన అంశం. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఎంత కష్టమో.. మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం మెల్లగా డిజిటల్ సర్వీసుల వైపు మొగ్గు చూపుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయ్యాక దాన్ని రెన్యూ చేసుకోవడం కూడా ఇప్పుడు సులభమే. దానికి కింద తెలిపిన ప్రక్రియ ఫాలో అయితే సరిపోతుంది.
స్టెప్ 1
మొదట పరివాహన్ సేవ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
స్టెప్ 2
హోం పేజ్‌లో ఆన్‌లైన్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి. అక్కడ డ్రాప్ డౌన్ మెనూలో 'driving license-related services'ను ఎంచుకోవాలి.
స్టెప్ 3
ఆ వెబ్‌సైట్ మిమ్మల్ని వేరే పేజీకి తీసుకువెళ్తుంది. అక్కడ మీరు మీకు కావాల్సిన రాష్ట్రాన్ని ఎంచుకోవచ్చు.
స్టెప్ 4
ఒక్కసారి మీకు కావాల్సిన రాష్ట్రాన్ని ఎంచుకున్నాక ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీకు రకరకాల ఆప్షన్లు, సేవలు కనిపిస్తాయి. ఆ జాబితాలో 'Apply for DL Renewal'ను ఎంచుకోవాలి.
స్టెప్ 5
'Instructions for Application Submission' పేజీలో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్‌ను జాగ్రత్తగా చదువుకుని 'continue'పై క్లిక్ చేయాలి.
స్టెప్ 6
డ్రైవింగ్ లెైసెన్స్ నంబర్‌ను ఇచ్చి, లైసెన్సు ఉన్న వ్యక్తి పుట్టినరోజును కూడా అక్కడ టైప్ చేయాలి. అనంతరం 'Get DL Details'పై క్లిక్ చేయాలి.
స్టెప్ 7
డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ యాక్సెప్ట్ అయ్యాక, ఈ లైసెన్స్ హోల్డరు ఏయే సేవలకు అర్హుడో అవన్నీ అక్కడ కనిపిస్తాయి.
స్టెప్ 8
అక్కడ మీకు కావాల్సిన సేవను ఎంచుకుని, ఇవ్వాల్సిన వివరాలను నింపాలి.
స్టెప్ 9
అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి
స్టెప్ 10
మీరు ఉన్న రాష్ట్రాన్ని బట్టి మీరు ఫొటో, సంతకాన్ని కూడా అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
స్టెప్ 11
కావాల్సిన రుసుముని చెల్లించండి
అంతే.. మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూ చేసుకున్నట్లే.. అయితే దానికి కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి:
1. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిన నెలలో రెన్యువల్‌కు అప్లై చేసుకుంటే, మీ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిన రోజు నుంచి రెన్యూ అవుతుంది.
2. లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిన 30 రోజుల తర్వాత అప్లై చేస్తే.. మీరు ఎప్పుడైతే అప్లై చేశారో.. ఆరోజు నుంచి రెన్యూ అవుతుంది. రూ.30 అదనపు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
3. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత.. రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండదు. తిరిగి కొత్త లైసెన్సుకు అప్లై చేయాల్సిందే.
Also Read: LPG cylinder Price: ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు..!
Also Read: UAN-Aadhar Linking: నవంబర్ 30 లోపు యూఏఎన్, ఆధార్ లింక్ చేయండి.. లేదంటే డబ్బులు జమ కావు
Also Read: Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు.. సోమవారం మార్కెట్లో పరిస్థితి ఏంటో?
Also Read: Renault Kwid: లీటరుకు 32.5 కిలోమీటర్ల మైలేజీ.. ర్యాలీలో రెనో క్విడ్ సూపర్ రికార్డు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Luna moped EV: లూనా మోపెడ్ మళ్లీ వచ్చేస్తోంది, దీనికి పెట్రోల్ అక్కర్లేదు - గుడ్‌న్యూస్ చెప్పిన కైనెటిక్ CEO
Royal Enfield Hunter: బైక్ లవర్స్‌కు షాక్ - రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ధరలు పెంపు, ఏ బైక్ ధర ఎంత పెరిగిందంటే?
Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?
మారుతి To టయోటా- రూ. 10 లక్షల్లోపు రాబోతున్న 5 బెస్ట్ కార్లు ఇవే!
బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నారా? అయితే, తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !