By: ABP Desam | Updated at : 26 Nov 2021 03:01 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎల్పీజీ సిలిండర్
వంటింటి గ్యాస్ ధరలు కొండెక్కుతున్నాయి..! ఒకప్పుడు రూ.500ల్లోపు ఉండే సిలిండర్ ధర ఇప్పుడు రూ.1000 వరకు ఎగబాకింది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ నగదు బదిలీ సైతం సక్రమంగా అవ్వడం లేదు. అయితే ఒక్కో సిలిండర్‌పై రూ.300 వరకు ఆదా చేసుకొనే మార్గం ఒకటుంది. ఇలా చేస్తే దేశంలోని ఎన్నో కుటుంబాలకు కొంత ప్రయోజనం దక్కుతుంది.
కొన్ని రోజుల ముందు వరకు వంటింటి గ్యాస్ బండ రూ.594 వరకు ఉండేది. అదిప్పుడు రూ.834కు ఆపై రూ.1000 వరకు చేరుకుంది. ఇప్పుడు రూ.300 వరకు సబ్సిడీ పొందాలంటే వారు తమ ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాను లింక్ చేయాలి. ధరల పెరుగుదలతో సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడని గమనించిన ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించుకుంది! ఇప్పటికే కొంత సబ్సిడీ పొందుతున్నవారు ఎక్కువ సబ్సిడీ పొందొచ్చు.
గతంలో ఒక సిలిండర్ కొనుగోలుపై సబ్సిడీని రూ.20 నుంచి 30కి తగ్గించారు. ఇప్పుడు దానిని రూ.300కు పెంచారు. ఉజ్వల పథకం కింద సిలిండర్లు తీసుకునే వారికి మరింత ప్రయోజనం కలుగనుంది. ఇంతకు ముందు వారికి రూ.174 వరకు సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు దానిని రూ.312కు పెంచారు. గతంలో రూ.153 సబ్సిడీ పొందేవారు ఇప్పుడు రూ.291 వరకు పొందొచ్చు.
ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. మీ సబ్సిడీ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేయడమే. దానిని మళ్లీ మీ గ్యాస్ సరఫరదారు వద్ద నమోదు చేయించాలి. ఇండియన్ గ్యాస్ వినియోగదారులు cx.indianoil.in, భారత్ గ్యాస్ కస్టమర్లు www.ebharatgas.comకు లాగిన్ అయితే మరింత సమాచారం దొరుకుతుంది. మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
Also Read: IPO Allotment Status: ఎంత ట్రై చేసినా ఐపీవో కేటాయించడం లేదా..? ఇలా చేస్తే బెటర్!!
Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ కొనాలా? వద్దా? మార్కెట్లలో జోరైతే లేదు మరి!
Also Read: Vintage Cars: వింటేజ్ కార్లను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్.. ఎందుకంటే?
Also Read: Latent View Analytics Ltd: 3 రోజుల్లో రూ.14,972కు రూ.38,304 లాభం..!
Also Read: Cryptocurrency Survey: క్రిప్టోను నియంత్రించొద్దు ప్లీజ్..! సర్వేలో 54% మంది స్పందన ఇది
Also Read: Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం