Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !
ఆసియా అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ రికార్డులకెక్కారు. అంబానీ కంపెనీల షేర్లు తగ్గడం.. అదానీ కంపెనీల షేర్లు పెరగడంతో సంపదతో తేడా వచ్చేసింది.
ఆసియా కుబేరునిగా గౌతమ్ అదానీ అవతరించారు. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి సౌదీ అరామ్‌కో డీల్ తేడా కొట్టడంతో వెనుకబడిపోయారు. మరో వైపు గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు పరుగులు పెడుతున్నాయి. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్న బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం ఇప్పుడు ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీనే.
Also Read : పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చవచ్చా? ఎంత ఖర్చవుతుంది?
అదానీ గ్రూప్ చైర్మన్ అండ్ ఫౌండర్ గౌతమ్ అదానీ ఆసియా రిచ్చెస్ట్ పర్సన్. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం గౌతమ్ అదానీ సంపద 88.8 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ సంపద 91 బిలియన్ డాలర్లు. ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. అయితే ఈ లెక్కలు బయటకు వచ్చిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అదే సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ పరుగులు పెట్టాయి.
Also Read : పడిపోయిన క్రిప్టో ధరలు.. దాదాపు అన్ని కాయిన్స్ నేల చూపులు, ఆ ప్రకటనతో అందరిలో ఆందోళన
సౌదీ అరామ్‌కో సంస్థతో రిలయన్స్ కొద్ది రోజుల క్రితం ఓ డీల్ సెట్ చేసుకుంది. కానీ మూడు రోజుల కిందట ఆ డీల్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆరామ్‌కోతో డీల్ బ్రేక్ తర్వాత రిలయన్స్ షేర్లు రోజురోజు క్షీణిస్తున్నాయి. రూ.2500కు పైకి ఉన్న రిలయన్స్ స్టాక్ ఇప్పుడు రూ.2350 దిగువకు వచ్చింది. ప్రతీ రోజూ నాలుగైదు శాతం వరకూ పడిపోతూ వస్తోంది. అదే సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ , అదానీ పోర్ట్స్ , అదానీ ట్రాన్సుమిషన్ , అదానీ పవర్ ఇలా అన్నీ భారీ లాభాల్లో ఉన్నాయి. అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ కొద్దిగా నష్టపోయిన పెద్దగా తేడా రాలేదు.
ఇటీవల అదానీ కంపెనీలకు ఇతర దేశాల నుంచి వస్తున్న పెట్టుబడులకు సరైన లెక్కలు లేవన్న ప్రచారం జరిగింది. వివరాలు సెబీకి ఇవ్వడం లేదన్న విషయం బయటకు వచ్చింది. అప్పట్లో అదానీ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. కానీ ఇప్పుడు కోలుకున్నాయి. ఆయనను నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాయి.
Also Read: Cryptocurrency Update: 2 గంటల్లో రూ.1000ని రూ.60 లక్షలుగా మార్చిన కొత్త క్రిప్టో కరెన్సీ