News
News
X

Cryptocurrency Update: 2 గంటల్లో రూ.1000ని రూ.60 లక్షలుగా మార్చిన కొత్త క్రిప్టో కరెన్సీ

మార్కెట్లో వచ్చిన ఓ కొత్త క్రిప్టో కరెన్సీ గంటల్లోనే వందలను లక్షల రూపాయాలుగా మార్చేసింది. ఏకంగా 6 లక్షల శాతం ర్యాలీ అయింది.

FOLLOW US: 
 
క్రిప్టో కరెన్సీ పరిశ్రమలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదు! హఠాత్తుగా ఓ కొత్త క్రిప్టో కాయిన్‌ పుట్టుకొస్తోంది. గంటల్లోనే వందలను వేలు.. వేలను లక్షలు.. లక్షలను కోట్లుగా మార్చేస్తోంది. కొన్నిరోజులకే బూమ్‌ పోయి పతనం అవుతోంది.

సోమవారం షి జు (SHIH) అనే కొత్త టోకెన్‌ పుట్టుకొచ్చింది. చైనా సంతతికి చెందిన ఓ శునకం పేరును దానికి పెట్టారు. ఈ టోకెన్‌ రెండు గంటల్లోనే విపరీతంగా ర్యాలీ అయింది. 6,00,000 శాతం ర్యాలీ అయిందని కాయిన్‌ మార్కెట్‌క్యాప్‌ తెలిపింది. షిజు కాయిన్‌ 0.000000009105 నుంచి 0.00005477 వరకు పెరిగింది. ఎక్స్‌ఛేంజుల్లో  వాల్యూమ్‌ 65 శాతం పెరిగింది. అసలు ఈ టోకెన్‌ ఎందుకలా ర్యాలీ అయిందో? దానికి కారణాలేంటో? ఎవరికీ అంతుపట్టడం లేదు.

షిజు టోకెన్‌ విపరీతంగా ర్యాలీ కావడంతో రెండు గంటల్లోనే 1000 రూపాయలు ఏకంగా రూ.60 లక్షలుగా అయ్యాయి. గతంలో కోకోస్వాప్‌, ఎథిరెమ్‌ మెటా, ఏఆర్‌సీ గవర్నన్స్‌ ఇలాగే హఠాత్తుగా ర్యాలీ అయ్యాయి. ఆ తర్వాత పతనానికి గురయ్యాయి. ఇక షిజు విషయానికి వస్తే ఇదో క్రాస్‌ చైన్‌ ఆధారిత మీమ్‌ టోకెన్‌. మెటావర్స్‌ గేమింగ్‌, మల్టీ చైన్‌ వాలెట్‌, ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్‌ వ్యవస్థల మిశ్రమంగా బయటకు వచ్చింది. కాగా షిజు క్రిప్టో చలామణీకి సంబంధించిన వివరాలు సరిగ్గా తెలియడం లేదని విశ్లేషకులు అంటున్నారు. గరిష్ఠంగా 1,000,000,000,000,000 షిజు కాయిన్లు సరఫరాలో ఉన్నాయి.

Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. 4 నెలల డీఏ, డీఆర్ బకాయిలు ఖాతాల్లోకి ఎప్పుడంటే..!

News Reels

Also Read: Multibagger share: 6 నెలల్లో లక్షకు రూ.2.62 కోట్ల రాబడి ఇచ్చిన పెన్నీ స్టాక్‌ ఇది!

Also Read: SBI ATM Cash Withdrawal: ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! మోసగాళ్ల నుంచి రక్షణగా కొత్త రూల్‌

Also Read: Go Fashion IPO: గ్రే మార్కెట్‌ ప్రీమియం ఏం చెబుతోంది? గో ఫ్యాషన్‌ సూపర్‌ హిట్టవుతుందా?

Also Read: GST Hike: బట్టలు, పాదరక్షలు కొనాలా? వెంటనే చేసేయండి.. లేదంటే జనవరిలో ధరల మోత తప్పదు!

Also Read: Ind vs NZ- 3rd T20, Full Match Highlight: న్యూజిలాండ్‌ను ఉతికేశారు.. 3-0తో సిరీస్ సాధించిన టీమిండియా!

Also Read: Ian Chappell on T20 WC: ప్రపంచకప్‌ టాస్‌ గెలువు కప్పు కొట్టుగా మారిందన్న ఇయాన్‌ ఛాపెల్‌..!

Also Read: Jeremy Solozano Injured: క్రికెట్‌ మైదానంలో విషాదం..! విండీస్‌ ఫీల్డర్‌ తలకు తగిలిన బంతి.. స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలింపు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Nov 2021 04:43 PM (IST) Tags: dog-based token cryptos Cryptocurrency Update SHIH shih tzu

సంబంధిత కథనాలు

UPI Transactions: పల్లెలూ, చిన్న పట్టణాల్లో 650% పెరిగిన యూపీఐ లావాదేవీలు - పట్టణాలతో ఢీ!

UPI Transactions: పల్లెలూ, చిన్న పట్టణాల్లో 650% పెరిగిన యూపీఐ లావాదేవీలు - పట్టణాలతో ఢీ!

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్‌ డల్‌! తగ్గిన బిట్‌కాయిన్‌ రేట్‌!

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్‌ డల్‌! తగ్గిన బిట్‌కాయిన్‌ రేట్‌!

Stock Market Closing 06 December 2022: సూచీలను నడిపిస్తున్న పీఎస్‌యూ బ్యాంక్స్‌ - నష్టాల్లోంచి తేరుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Closing 06 December 2022: సూచీలను నడిపిస్తున్న పీఎస్‌యూ బ్యాంక్స్‌ - నష్టాల్లోంచి తేరుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Five-Star Business Finance: ఫుల్‌ రైజింగ్‌లో ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ స్టాక్‌, ఇవాళ 19% జూమ్‌

Five-Star Business Finance: ఫుల్‌ రైజింగ్‌లో ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ స్టాక్‌, ఇవాళ 19% జూమ్‌

India GDP Growth: గుడ్‌ న్యూస్‌, భారత జీడీపీ వృద్ధి అంచనా పెంచిన ప్రపంచ బ్యాంక్‌

India GDP Growth: గుడ్‌ న్యూస్‌, భారత జీడీపీ వృద్ధి అంచనా పెంచిన ప్రపంచ బ్యాంక్‌

టాప్ స్టోరీస్

సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే అపశృతి, బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి

సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే అపశృతి, బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి

AP BJP : ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం - ఏబీ బీజేపీ నాయకత్వానికి నడ్డా అభినందనలు

AP BJP :  ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం - ఏబీ బీజేపీ నాయకత్వానికి నడ్డా అభినందనలు

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana :  మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ -  బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!