Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
విజయ్ హజారే ట్రోఫీ ఏ సంవత్సరం లేని విధంగా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అందుకు కారణం చాలా సంవత్సరాల తర్వాత స్టార్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్ లో ఆడటమే. ఈ టోర్నీలో యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ సూపర్ సెంచరీ చేసాడు. 60 బంతుల్లో నాలుగు సిక్సులు, 11 ఫోర్లతో 106 పరుగులు చేశాడు ఉత్తర్‌ప్రదేశ్ కెప్టెన్.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్, చంఢీగఢ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రింకు సింగ్ సెంచరీలు చేశారు. దాంతో ఫ్యాన్స్ అంతా రింకు సింగ్ కు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇదే తరహాలో వరల్డ్ కప్ 2026 లో కూడా ఆడాలని కామెంట్స్ చేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026 స్క్వాడ్ లో రింకు ను సెలెక్ట్ చేసి సెలెక్టర్లు సరైన నిర్ణయమే తీసుకున్నారని అంటున్నారు. గతంలో టీ20 దూరమైన రింకూ.. విజయ్ హజారే ట్రోఫీలో పరుగులు సాధిస్తూ తాను ఫామ్ లో ఉన్నాడని నిరూపించుకుంటున్నాడు. డొమెస్టిక్ ఫార్మాట్‌లో రింకూ సింగ్ చేసిన ప్రదర్శన ఐసీసీ మెగా టోర్నీలో ఉపయోగపడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.





















