Ian Chappell on T20 WC: ప్రపంచకప్ టాస్ గెలువు కప్పు కొట్టుగా మారిందన్న ఇయాన్ ఛాపెల్..!
టాస్ గెలిస్తే ప్రపంచకప్ కొట్టేయొచ్చని అనిపించిందని ఇయాన్ ఛాపెల్ అంటున్నాడు. సుదీర్ఘకాలం తర్వాత ఆసీస్ మెగాటోర్నీ గెలిచిందని.. ఇందుకు అదృష్టమూ కలిసొచ్చిందని పేర్కొన్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టాస్ గెలువు కప్పు పట్టు అన్నట్టుగా మారిపోయిందని ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ అన్నాడు. రెండు జట్లకు సమంగా అవకాశాలు ఉండేలా ఐసీసీ ఏదో ఒక మార్గం కనిపెట్టాలని సూచించాడు. దశాబ్దకాలంలో ఎదురు చూస్తున్న పొట్టి కప్పును ఆసీస్ గెలిచినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇందుకు అదృష్టమూ కలిసొచ్చిందని వెల్లడించాడు.
యూఏఈ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో టాసే కీలకంగా మారింది. ఎవరు టాస్ గెలిస్తే వారినే విజయం వరించింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ వంటి జట్లకు ఇది కలిసొచ్చింది. ఇక సెమీసులు, ఫైనల్లోనూ ఇదే స్పష్టమైంది. టాస్ ఓడిన ఇంగ్లాండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ పరాజయం పాలయ్యాయి. కాగా టీ20 క్రికెట్ ప్రవేశపెట్టిన 12 ఏళ్లకు ఆస్ట్రేలియా తొలి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.
'ఎట్టకేలకు ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలిచింది. ఇందుకు దశాబ్దకాలం తీసుకుంది. వారు బౌండరీలు బాది విజయం అందుకున్నారు. వికెట్లు తీయగల బౌలింగ్ కూడా కనిపించింది. వారికి అదృష్టమూ కలిసొచ్చింది. కీలక మ్యాచుల్లో టాస్ గెలిచారు. మొత్తానికి ప్రపంచకప్ టాస్ గెలువు కప్పు పట్టు అన్నట్టుగా మారింది. మెగా టోర్నీలో ఇదే అన్యాయంగా అనిపించింది. టాస్ గెలిచిన వారే విజయం సాధించే అనుకూలతను నివారించేలా ఐసీసీ ఏదైనా చేయాలి' అని చాఫెల్ అన్నాడు.
కాలం మారే కొద్దీ పొట్టి క్రికెట్ ఎంటర్‌టైన్‌మెంట్‌లాగా మారిందని ఇయాన్ అంటున్నాడు. ఆట, ఎంటర్‌టైన్ మెంట్ 60:40గా ఉంటే మంచిదన్నాడు. టీ20 క్రికెట్ బ్యాటర్లకు మరింత అనుకూలంగా మారిందని విమర్శించాడు. చక్కని బంతులు సైతం బ్యాటు అంచులకు తగిలి బౌండరీలకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మిస్‌హిట్ అయిన బంతులు బౌండరీలు చేరడం బౌలర్లకు కోపం తెప్పిస్తోందని వెల్లడించాడు. బౌలర్లకు ఉపయోగపడేలా నిబంధనలు సవరిస్తే మంచిదని అంటున్నాడు.
Also Read: Ind vs NZ, 2nd T20, Highlights: RRRకు తొలి విజయం.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచేసిన టీమిండియా!
Also Read: WATCH: సెక్యూరిటీ దాటుకొని రోహిత్ పాదాలను తాకిన రాంచీ అభిమాని..!
Also Read: Daniel Vettori: బుమ్రాతో పటేల్ కలిశాడంటే..! టీమ్‌ఇండియాను ఎవ్వరేం చేయలేరు అంటున్న వెటోరీ
Also Read: MS Dhoni IPL update: ఐపీఎల్ 2022 ధోనీ ఆడతాడా? ఆడడా? మళ్లీ మొదలైన రచ్చ..!
Also Read: MSD on IPL: సంవత్సరమా.. ఐదేళ్లా.. ఐపీఎల్ కెరీర్‌పై ధోని ఏమన్నాడంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి