MSD on IPL: సంవత్సరమా.. ఐదేళ్లా.. ఐపీఎల్ కెరీర్‌పై ధోని ఏమన్నాడంటే?
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఐపీఎల్ కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన చివరి టీ20 మ్యాచ్ గురించి చెప్పాడు. వచ్చే సంవత్సరం ఆడతానో, ఐదు సంవత్సరాల్లో ఆడతానో తెలీదు కానీ.. తన చివరి టీ20 గేమ్ మాత్రం చెన్నైలోనే ఆడతానని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాలుగో టైటిల్ దక్కిన సంగతి తెలిసిందే.
‘నా క్రికెట్‌ను నేను ఎప్పుడూ ప్లాన్ చేసుకున్నాను. నేను ఆడిన చివరి వన్డే మ్యాచ్ నా సొంత ఊరు రాంచీలో ఆడాను. నా చివరి టీ20 చెన్నైలో ఆడాలని అనుకుంటున్నాను. అది వచ్చే సంవత్సరమా.. మరో ఐదేళ్ల పాటు ఆడతానా.. అనే సంగతి తెలియరాలేదు.’ అని ధోని చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయోత్సవాలు చెన్నైలో జరిగాయి. ఈ సందర్భంగా ధోని ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘మేం బెంగళూరులో ఆడినా.. జొహాన్నెస్‌బర్గ్‌లో ఆడినా.. దుబాయ్‌లో ఆడినా మాకు సపోర్ట్ చేశారు. మేం రెండు సంవత్సరాలు ఐపీఎల్ ఆడకపోయినా.. సోషల్ మీడియాలో మా జట్టే రావాలని ఎందరో కోరుకున్నారు.’ అని కూడా తెలిపాడు.
తాము కేవలం ప్రాసెస్‌ను మాత్రమే నమ్మామని, అదే ఫలితాలను ఇచ్చిందని కూడా తెలిపాడు. 2020లో బ్యాడ్ సీజన్ తర్వాత తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వడానికి అదే కారణం అని పేర్కొన్నాడు. ‘2008 నుంచి మేం ఫ్రాంచైజీ క్రికెట్‌ను ఎంతో బాగా ఆడుతున్నాం. కానీ 2020లో మొదటిసారి ప్లేఆఫ్స్‌కు దూరం అయ్యాం. మా ఫ్రాంచైజీ గురించి తెలుసుకోవడానికి మాకు మంచి అవకాశం దొరికింది. ఆటగాళ్లకు, ఫ్యాన్స్‌కు గౌరవం ఇచ్చే అవకాశం దొరికింది.’ అన్నాడు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. తాను, తన తండ్రి కరుణానిధి మహేంద్ర సింగ్ ధోనికి పెద్ద ఫ్యాన్స్ అని ఆయన అన్నారు. అయితే ఈ సందర్భంగా ధోని మాట్లాడిన మాటలు ఫ్యాన్స్‌కు పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు. మరిన్ని సంవత్సరాలు ధోనిని ఎల్లో జెర్సీలో చూసే అవకాశం ఉంది.
Also Read: Tim Paine Quits: మహిళకు ఆసీస్ క్రికెటర్ అశ్లీల సందేశం.. వివాదం ముదిరి కెప్టెన్సీకి రిజైన్
Also Read: AB de Villiers Retirement: ఇకపై కోహ్లీ, ఏబీడీ కలిసి ఆడరు.. షాకింగ్ న్యూస్ చెప్పిన ఏబీడీ?
Also Read: ABD Retirement: గుండె బద్దలైంది..! లవ్‌యూ సోదరా అంటూ ఏబీడీ, కోహ్లీ బ్రొమాన్స్!
Also Read: MS Dhoni fan: ధోనీని చూసేందుకు 1436 కి.మీ పాదయాత్ర చేసిన డైహార్డ్ ఫ్యాన్!
Also Read: Ind vs NZ, 2nd T20, Highlights: RRRకు తొలి విజయం.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచేసిన టీమిండియా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి