Tim Paine Quits: మహిళకు ఆసీస్ క్రికెటర్ అశ్లీల సందేశం.. వివాదం ముదిరి కెప్టెన్సీకి రిజైన్
ఆసీస్ కెప్టెన్సీకి టిమ్‌పైన్ గుడ్‌బై చెప్పేశాడు. అతడి మీద అశ్లీల సందేశాల వివాదం తలెత్తింది. అందరూ క్షమించాలంటూ రాజీనామా చేశాడు.
కీలకమైన యాషెస్ సిరీసుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది! జట్టుకు నాయకత్వం వహిస్తున్న టిమ్ పైన్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. నాలుగేళ్ల క్రితం ఓ మహిళా సభ్యురాలికి అశ్లీల సందేశాలు పంపించడమే ఇందుకు కారణం. గతంలో తన ప్రవర్తనకు ఆసీస్ అభిమానులు, కుటుంబ సభ్యులు, భార్య, అవతలి వ్యక్తి తనను క్షమించాలని కోరాడు.
బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్టీవ్‌స్మిత్‌పై ఏడాదిపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆసీస్‌లో నాయకత్వ సంక్షోభం తలెత్తడంతో టిమ్‌పైన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అప్పటికి అతడు జాతీయ జట్టుకు దూరమై చాలాకాలమే అయింది. 2018 నుంచి పైన్ జట్టును బాగానే నడిపించాడు. కానీ హఠాత్తుగా అతడిపై అశ్లీల సందేశాల వివాదం తెరపైకి వచ్చింది.
2017లో టిమ్‌పైన్ జట్టులోకి రావడానికి ముందు ఓ మహిళా సభ్యురాలికి అసభ్య సందేశం పంపించాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ విభాగం, క్రికెట్ టాస్మేనియా హెచ్‌ఆర్ విభాగం విచారణ జరిపి అతడికి క్లీన్‌చిట్ ఇచ్చాయి. అప్పుడు పంపించిన సందేశం తాజాగా వైరల్ అయింది. వివాదం మళ్లీ తెరపైకి వచ్చి అందరికీ తెలిసిపోయింది. దాంతో అతడు హోబర్ట్‌లో ప్రెస్‌మీట్ పెట్టి జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు. ఆటగాడిగా కొనసాగుతానని చెప్పాడు.
ప్రస్తుతం ఆసీస్‌కు పేసర్ ప్యాట్ కమిన్స్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. బహుశా యాషెస్‌కు అతడే సారథ్యం వహించొచ్చు. ఒకవేళ టిమ్ పైన్ వీడ్కోలు పలికితే కెప్టెన్సీ రేసులో అలెక్స్ కేరీ ఎప్పట్నుంచో రేసులో ఉన్నాడు. వీరిద్దరిలో ఎవరో ఒకరు టెస్టు జట్టుకు సారథి కావొచ్చు. ఇప్పటికైతే ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!
Also Read: Ricky Ponting Update: ఐపీఎల్ సమయంలో పాంటింగ్‌కు టీమ్‌ఇండియా కోచ్ ఆఫర్.. ఎందుకు తిరస్కరించాడంటే?
Also Read: Ind vs NZ 2nd T20I: రెండో టీ20 వాయిదా పడుతుందా? ఏకంగా హైకోర్టులో!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Who should be Australia's next men's Test captain?
— ESPNcricinfo (@ESPNcricinfo) November 19, 2021