By: ABP Desam | Updated at : 18 Nov 2021 12:05 PM (IST)
Edited By: Ramakrishna Paladi
rohit-boult
న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌తో కలిసి చాలా క్రికెట్ ఆడానని టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు. తన బలహీనతలేంటో అతడికి తెలుసని, అతడి బలమేంటో తనకు తెలుసని పేర్కొన్నాడు. అతడెలాంటి బంతులు వేస్తాడో తనకు ముందే తెలుసని వెల్లడించారు. టీమ్‌ఇండియా కుర్రాళ్లను ప్రశంసించాడు. తొలి టీ20లో కివీస్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత హిట్‌మ్యాన్ మాట్లాడాడు.
'ఆఖర్లో ఆడటం అంత సులువు కాదు. కుర్రాళ్లు నేర్చుకొనేందుకు ఇదో మంచి అవకాశం. గతంలో వారెప్పుడూ ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియాకు ఆడలేదు. జట్టుకు ఏం అవసరమో వారికి అర్థమవుతుంది. ప్రతిసారీ పవర్ హిట్టింగ్ చేయడం ముఖ్యం కాదు. ఫీల్డర్‌కు కుడి లేదా ఎడమ వైపు బంతిని పంపించి సింగిల్స్ తీయడమూ ముఖ్యమే. ఇక బౌలర్లు ఆఖర్లో పుంజుకున్న తీరు అద్భుతం. అశ్విన్, అక్షర్ దిల్లీకి కలిసి ఆడారు. వారిద్దరూ వికెట్లు తీయడంలో ముందుంటారు. ఇక సూర్య అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. స్పిన్‌ను బాగా ఎదుర్కొన్నాడు. పేస్‌లోనూ బాగా ఆడతాడు' అని రోహిత్ అన్నాడు.
ముంబయి ఇండియన్స్‌లో ట్రెంట్ బౌల్ట్‌తో కలిసి రోహిత్ ఆడాడు. దాంతో అతడి గురించి మ్యాచ్ తర్వాత మాట్లాడాడు. 'మేమిద్దరం కలిసి చాలా క్రికెట్ ఆడాం. నా బలహీనతలు అతడికి తెలుసు. అతడి బలమేంటో నాకు తెలుసు. అందుకే మా ఇద్దరి మధ్య మంచి పోటీ ఉంటుంది. నేనతడికి కెప్టెన్‌గా ఉన్నప్పుడు బ్యాటర్‌ను బ్లఫ్ చేయాలని ఎప్పుడూ చెబుతుంటాను. అతడదే చేస్తుంటాడు. అతడు మిడ్‌వికెట్ ఫీల్డర్‌ను వెనక్కి, ఫైన్‌లెగ్ ఫీల్డర్‌ను ముందుకు తీసుకొచ్చాడు. అతడు బౌన్సర్ వేస్తాడని నాకు తెలుసు. అందుకే ఆ బంతిని ఫీల్డర్ మీదుగా ఆడాలని ప్రయత్నించా. దురదృష్ట వశాత్తు బంతిలో ఎక్కువ వేగం లేదు' అని హిట్‌మ్యాన్ తెలిపాడు.
4⃣8⃣ Runs
3⃣6⃣ Balls
5⃣ Fours
2⃣ Sixes
Captain @ImRo45 narrowly missed out on his fifty but set the ball rolling for #TeamIndia in the chase. 👍 #INDvNZ @Paytm
Watch his fine knock 🎥 🔽 — BCCI (@BCCI) November 17, 2021
Also Read: Rohit Sharma on Kohli: విరాట్ గురించి రోహిత్ బిగ్ స్టేట్‌మెంట్.. ఏం చెప్పాడో తెలుసా?
Also Read: ICC Mens Cricket Committee: ఐసీసీలో దాదాగిరి! మరో కీలక పదవికి ఎంపికైన గంగూలీ
Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ సెరెనా సంచలన నిర్ణయం
Team India Squad: ఆసియాకప్‌కు తిరిగొస్తున్న కోహ్లీ - 15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ!
India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!
స్వర్ణ విజేత పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు
CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?
Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి
Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!
Zoonotic Langya virus: చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?
Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!