News
News
X

ICC Mens Cricket Committee: ఐసీసీలో దాదాగిరి! మరో కీలక పదవికి ఎంపికైన గంగూలీ

సౌరవ్‌ గంగూలీ మరో ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టారు. ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అనిల్‌ కుంబ్లే స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.

FOLLOW US: 

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరో ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టారు. ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా నియామకం అయ్యారు. సహచరుడు అనిల్‌ కుంబ్లే నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే ప్రకటించారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ లేనంత వరకు దాదా ఇటు బీసీసీఐ, అటు ఐసీసీలో కీలకంగా ఉంటారు.

తొమ్మిదేళ్లుగా అనిల్‌ కుంబ్లే ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. మూడుసార్లు మూడేళ్ల పదవీకాలం పనిచేశారు. నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్‌) ప్రవేశపెట్టడం, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫార్మాట్‌, ఇతర టెక్నికల్‌ అంశాల్లో అభివృద్ధికి కుంబ్లే కృషి చేశారు. ఆటగాడు, కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించిన గంగూలీ ఆ తర్వాత బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత బీసీసీఐలో అత్యున్నత పదవిని చేపట్టారు.

'ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న గంగూలీకి స్వాగతం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడు, అతిపెద్ద బోర్డు పాలకుడిగా అతడి అనుభవం మేం విలువైన నిర్ణయాలు తీసుకొనేందుకు ఉపయోగపడుతుంది. తొమ్మిదేళ్లుగా కమిటీని నడిపించిన కుంబ్లే నాయకత్వానికి ధన్యవాదాలు. డీఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టడం, అనుమానిత బౌలింగ్‌ శైలి నిర్ధారణ ప్రక్రియల్లో ఆయనెంతో బాగా పనిచేశారు' అని ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే అన్నారు.

Also Read: IND vs NZ: మరో చరిత్రకు నాంది! కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ మొదటి సిరీస్‌.. కివీస్‌తో నేడే ఢీ!

Also Read: IND vs NZ: టీమ్‌ఇండియాతో టీ20 సిరీసుకు కేన్‌ విలియమ్సన్‌ దూరం.. కెప్టెన్‌ ఎవరంటే!

Also Read: IPL 2021: ఎంత బాధేసిందో తెలుసా!! సన్‌రైజర్స్‌ను ఎంత ప్రేమించానో మీకెవ్వరికీ తెలియదన్న డేవిడ్‌ వార్నర్‌

Also Read: ICC Announcement: 4 టీ20, 2 వన్డే ప్రపంచకప్‌లు, 2 ఛాంపియన్స్‌ ట్రోఫీలు ప్రకటించిన ఐసీసీ.. భారత్‌ వేటికి ఆతిథ్యం ఇస్తోందంటే?

Also Read: Uganda: ఉగాండాలో వరుస పేలుళ్లు.. భారత జట్టు సేఫ్.. ఈ వీడియోలు చూశారా?

Also Read: World's Richest Country: అమెరికాకు షాక్‌!! అత్యంత సంపన్న దేశంగా చైనా.. 20 ఏళ్లలోనే యూఎస్‌ను వెనక్కినెట్టిన డ్రాగన్‌

Also Read: Bank Account Video KYC: బ్యాంకుకు వెళ్లకుండానే ఖాతా తెరవొచ్చు.. ఈ-కేవైసీతో సింపుల్‌గా.. ఇంటి వద్ద నుంచే..!

Also Read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో మరో ముందడుగు.. తాజా అప్‌డేట్‌ ఇదే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 17 Nov 2021 03:26 PM (IST) Tags: BCCI Sourav Ganguly BCCI President ICC Mens Cricket Committee ICC Mens Cricket Committee Chairman

సంబంధిత కథనాలు

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?

BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?

CWG Champions PM Meeting: ఆటోగ్రాఫ్‌ చేసిన గ్లోవ్స్‌ను మోదీకిచ్చిన నిఖత్‌! గమ్చా అలంకరించిన హిమ దాస్‌!

CWG Champions PM Meeting: ఆటోగ్రాఫ్‌ చేసిన గ్లోవ్స్‌ను మోదీకిచ్చిన నిఖత్‌! గమ్చా అలంకరించిన హిమ దాస్‌!

Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్

Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!