ICC Announcement: 4 టీ20, 2 వన్డే ప్రపంచకప్‌లు, 2 ఛాంపియన్స్ ట్రోఫీలు ప్రకటించిన ఐసీసీ.. భారత్ వేటికి ఆతిథ్యం ఇస్తోందంటే?
రాబోయే ఏడేళ్ల కాలంలో జరిగే మెగా ఈవెంట్లను ఐసీసీ ప్రకటించింది. నాలుగు టీ20, 2 వన్డే ప్రపంచకప్‌లు, 2 ఛాంపియన్స్ ట్రోఫీలు, వాటి ఆతిథ్య దేశాలు, తేదీలను వెల్లడించింది. భారత్ ఎన్ని దక్కాయంటే?
![ICC Announcement: 4 టీ20, 2 వన్డే ప్రపంచకప్‌లు, 2 ఛాంపియన్స్ ట్రోఫీలు ప్రకటించిన ఐసీసీ.. భారత్ వేటికి ఆతిథ్యం ఇస్తోందంటే? ICC announced mens white-ball cricket new tournaments, host Champions Trophy for 2024-31 ICC Announcement: 4 టీ20, 2 వన్డే ప్రపంచకప్‌లు, 2 ఛాంపియన్స్ ట్రోఫీలు ప్రకటించిన ఐసీసీ.. భారత్ వేటికి ఆతిథ్యం ఇస్తోందంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/d6754b0899fc1b7ade6486119b0f7b27_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఐసీసీ భవిష్య ప్రణాళికను వెలువరించింది. దశాబ్ద కాలంలో జరిగే మెగా టోర్నీలు, ఆతిథ్య దేశాల వివరాలను ప్రకటించింది. తెలుపు బంతి క్రికెట్‌కు సంబంధించి కొన్ని అనూహ్య నిర్ణయాలు వెల్లడించింది.
2024 నుంచి 2031 వరకు జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీల గురించి ఐసీసీ వివరించింది. 8 కొత్త టోర్నీలు, 12 వేర్వేరు ఆతిథ్య దేశాలు, ఛాంపియన్స్ ట్రోఫీ అధికారికంగా పునరాగమనం చేసిందని వెల్లడించింది.
2024-2031 మధ్య టోర్నీలివే
- ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ - వెస్టిండీస్, యూఎస్‌ఏ - 2024, జూన్
- ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ - పాకిస్థాన్ - 2025, ఫిబ్రవరి
- ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ - భారత్, శ్రీలంక - 2026, ఫిబ్రవరి
- ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ - దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా - అక్టోబర్/నవంబర్ 2027
- ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ - 2028, అక్టోబర్
- ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ - భారత్ - 2029
- ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్- ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ - 2030, జూన్
- ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ - భారత్, బంగ్లాదేశ్ - 2031, అక్టోబర్/నవంబర్
క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు ఐసీసీ చురుకుగా అడుగులు వేస్తోంది. 2024 టీ20 ప్రపంచకప్ హక్కులను అమెరికా, వెస్టిండీస్‌కు ఇచ్చింది. ఆ తర్వాత ఎనిమిది నెలలకే 2025, ఫిబ్రవరిలో పాకిస్థాన్ ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోంది. 1996లో వన్డే ప్రపంచకప్ తర్వాత అక్కడ జరిగే తొలి ఐసీసీ ఈవెంట్ ఇదే.
ఇప్పుడిప్పుడే ప్రపంచ క్రికెట్లో మెరుస్తున్న నమీబియాకూ గౌరవం దక్కింది. 2027లో జింబాబ్వే, దక్షిణాఫ్రికాతో పాటు ఆ దేశమూ పురుషుల వన్డే ప్రపంచకప్‌కు వేదిక కానుంది. 1999 తర్వాత స్కాట్లాండ్ ఓ మేజర్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. 2030లో ఇంగ్లాండ్‌తో కలిసి టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
మొత్తంగా ఈ పదేళ్ల కాలంలో భారత్ ఐసీసీ వన్డే, టీ20, ఛాంపియన్స్ ట్రోఫీలకు వేదిక కానుంది.
Are you ready for the best-ever decade of men’s white-ball cricket?
— ICC (@ICC) November 16, 2021
Eight new tournaments announced 🔥
14 different host nations confirmed 🌏
Champions Trophy officially returns 🙌https://t.co/OkZ2vOpvVQ pic.twitter.com/uwQHnna92F
Also Read: Candice Warner on Twitter: హేళన చేయకు బ్రో.. సన్‌రైజర్స్‌కు సరైన రిప్లై ఇచ్చిన వార్నర్ భార్య
Also Read: T20 World Cup Prize Money: విశ్వవిజేతకు వచ్చింది ఇదే.. టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఎంతంటే?
Also Read: Sachin Debut Day: ఆటగాడిగా వచ్చి.. దేవుడిగా ఎదిగి.. సచిన్ ఎంట్రీకి 32 ఏళ్లు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)