అన్వేషించండి

Sachin Debut Day: ఆటగాడిగా వచ్చి.. దేవుడిగా ఎదిగి.. సచిన్ ఎంట్రీకి 32 ఏళ్లు!

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్.. సరిగ్గా 32 సంవత్సరాల కిందట ఇదే రోజు అరంగేట్రం చేశాడు.

నవంబర్ 15, 1989.. సరిగ్గా 32 సంవత్సరాల కిందట ఇదే రోజున భారత క్రికెట్లో కొత్త శకానికి అడుగు పడింది. లిటిల్ మాస్టర్, భారత క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్, పరుగుల యంత్రం.. ఇలా ఎన్నో ముద్దు పేర్లు, బిరుదులు ఉన్న సచిన్ టెండూల్కర్ అదేరోజున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారతదేశంలో క్రికెట్‌ను మతం స్థాయికి తీసుకెళ్లింది సచినే. తన శకంలో ఫ్యాన్ బేస్‌లో తనని కొట్టేవాళ్లే లేరంటే అతిశయోక్తి కాదు.

రికార్డులు సృష్టించడం తనకు మంచి నీళ్లు తాగినంత ఈజీ. క్రీజులో సచిన్ ఉంటే మ్యాచ్ గెలిచేసినట్లే అన్న ఫీలింగ్‌లో భారత క్రికెట్ అభిమానులు ఉండేవారు. భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 187వ ఆటగాడు సచిన్ టెండూల్కర్. మరి సచిన్ తన మొదటి మ్యాచ్‌లో ఎంత పరుగులు చేశాడు? ఆ మ్యాచ్ భారత్ గెలిచిందా? ఓడిందా? డ్రా అయిందా?

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన సచిన్ టెండూల్కర్ 24 బంతుల్లో 15 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో తనకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అదే సిరీస్ రెండో మ్యాచ్‌లో సచిన్ అర్థ సెంచరీ సాధించాడు.

అక్కడ మొదలైన సచిన్ రికార్డుల పర్వం ఎక్కడా ఆగలేదు. రిటైర్ అయి ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ.. ఇప్పటి కొన్ని రికార్డులు తన పేరు మీదనే ఉన్నాయి. ఇప్పటికీ సచిన్ పేరు మీదనే ఉన్న పలు రికార్డులు ఇవే..

1. అత్యధిక టెస్టు మ్యాచ్‌లు - 200
2. టెస్టుల్లో అత్యధిక పరుగులు - 15,921
3. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు - 51
4. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక ఫోర్లు - 2,058
5. వన్డేల్లో ఒక సంవత్సరంలో అత్యధిక పరుగులు - 1,894
6. వన్డేల్లో అత్యధిక సెంచరీలు - 49
7. వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు - 96
8. అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు - 20
9. మొత్తం కెరీర్‌లో అత్యధిక 50కి పైగా స్కోర్లు - 264

Also Read: T20 World Cup 2021: మీమ్‌ క్రియేటర్లకు షాక్‌..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!

Also Read: CK Nayudu: 50 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ.. 62 ఏళ్లప్పుడు చివరి మ్యాచ్, క్రికెట్ చరిత్రలో సీకే నాయుడు ఒక శిఖరం

Also Read: Shahid Afridi on Virat Kohli: కోహ్లీ అన్నింట్లో కెప్టెన్సీ వదిలేస్తే మంచిది.. రోహిత్‌కు అఫ్రిది మద్దతు

Also Read: Rohit Sharma 264: ఆ ‘264’కు ఏడేళ్లు.. ఆ రోజు రోహిత్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Live Cricket Streaming: మ్యాచ్ టీవీలో కాదు రీల్స్‌లో చూడండి.. టిక్‌టాక్‌లో ఇండియా న్యూజిలాండ్ లైవ్ స్ట్రీమింగ్, పవర్‌ప్లే క్రేజ్ కోసం కివీస్ సరికొత్త ప్రయోగం
మ్యాచ్ టీవీలో కాదు రీల్స్‌లో చూడండి.. టిక్‌టాక్‌లో ఇండియా న్యూజిలాండ్ లైవ్ స్ట్రీమింగ్, పవర్‌ప్లే క్రేజ్ కోసం కివీస్ సరికొత్త ప్రయోగం
Brook Historic Blitz: గిల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో బ్రూక్ వరల్డ్ రికార్డు
గిల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో బ్రూక్ వరల్డ్ రికార్డు
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Mega Jersey Deal: MI జెర్సీపై ఇక ఆ ఐకానిక్ లోగో.. నైకీతో రిలయన్స్ స్పోర్ట్స్ చారిత్రక ఒప్పందం, 2027 సీజన్ నుంచి కొత్త కిట్లలో MI ఆటగాళ్ల మెరుపులు
MI జెర్సీపై ఇక ఆ ఐకానిక్ లోగో.. నైకీతో రిలయన్స్ స్పోర్ట్స్ చారిత్రక ఒప్పందం, 2027 సీజన్ నుంచి కొత్త కిట్లలో MI ఆటగాళ్ల మెరుపులు

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget