CK Nayudu: 50 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ.. 62 ఏళ్లప్పుడు చివరి మ్యాచ్, క్రికెట్ చరిత్రలో సీకే నాయుడు ఒక శిఖరం
సీకే నాయుడు 1895, అక్టోబర్ 31న నాగ్‌పుర్‌లోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. నాగ్‌పుర్‌లోనే పెరిగిన ఈయన పాఠశాల రోజులనుంచే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచారు.
భారత క్రికెట్ చరిత్రలో మెుదటి రోజులు అవి. కటారీ కనకయ్య నాయుడు.. ఆ సమయంలోనే రంజీ ఆటగాడిగా మంచి గుర్తింపు పొందారు. ఆయనేవరో కాదు.. అదే మన సీకే నాయుడు. అంతేకాదు, భారత క్రికెట్ జట్టు టెస్ట్ మ్యాచ్‌లకు మొట్టమొదటి కెప్టెన్ కూడా ఆయనే. తన 62 ఏళ్ల వయసులోనూ రంజీ ట్రోఫీలో ఆడి తన సత్తా చాటారు. మరో గొప్ప విషయం ఏంటంటే.. ఆ మ్యాచ్‌లో 52 పరుగులు చేశారు. ఆపై రిటైర్ అయ్యాక జట్టు సెలక్టర్‌గా, రేడియోలో కామెంటర్‌గానూ చేశారు. నవంబరు 14న ఆయన వర్థంతి. ఈ సందర్భంగా సీకే నాయుడు క్రికెట్ జీవితంపై ‘ఏబీపీ దేశం’ ప్రత్యేక కథనం..
భారత తొలి టెస్ట్ క్రికెట్ కెప్టెన్
సీకే నాయుడు 1895, అక్టోబర్ 31న నాగ్‌పుర్‌లోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. నాగ్‌పుర్‌లోనే పెరిగిన ఈయన పాఠశాల రోజులనుంచే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ చూపేవారు. ఈయన ప్రథమ శ్రేణి క్రికెట్ ఆటలో ప్రవేశం ఎలా జరిగిందో తెలుసా.. 1916లో హిందూ జట్టులో, యూరోపియన్ జట్టుకు వ్యతిరేకంగా జరిగింది. ఈయన ఆ ఆటలో తమ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగుకు దిగారు. మొదటి మూడు బంతులు అడ్డుకొని, నాలుగో బంతిని సిక్సర్ కొట్టారు సీకే నాయుడు. అలా మెుదలైన ఆయన.. ప్రస్థానం.. చివరి వరకూ సాగింది.
Also Read: మొదటిసారి ఫైనల్స్‌కు న్యూజిలాండ్.. బై.. బై.. ఇంగ్లండ్
ఆరు దశాబ్దాలపాటు "ఫస్ట్ క్లాస్ క్రికెట్" ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సీకే నాయుడు ఒకరు. 1956-57 రంజీ ట్రోఫీలో తన 62వ ఏట అతను చివరిసారి ఆడారు. ఆ మ్యాచ్‌లో 52 పరుగులు చేశారు. రిటైర్ అయ్యాక కొన్నాళ్ళు జట్టు సెలెక్టర్‌గా, రేడియో వ్యాఖ్యాతగా ఆటతో తన అనుబంధం కొనసాగించారు. ఈయన 1967, నవంబర్ 14న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మరణించారు.
కుటుంబ నేపథ్యం
సీకే నాయుడు పూర్వీకులు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వారు. వాళ్ల కుటుంబం ఎప్పుడో హైదరాబాద్ లో స్థిరపడింది. నారాయణస్వామి నాయుడు తాత నిజాం నవాబు వద్ద దుబాసీగా పనిచేసేవారు. తరువాత వారి మకాం ఔరంగాబాద్‌కు మారింది. చివరికి సీకే నాయుడి తండ్రి సూర్యప్రకాశరావు నాయుడు హోల్కర్ సంస్థానంలో న్యాయమూర్తిగా ఉంటూ, నాగ్‌పూర్ లో స్థిరపడ్డారు. సీకే నాయుడు అక్కడే పుట్టి పెరిగారు. సీకే ప్రతిభను గౌరవిస్తూ, హోల్కర్ సంస్థానాధీశుడు 1923లో ఆయనకి తన సైన్యంలో అత్యున్నత పదవినిచ్చి, ఇండోర్ రావలసిందిగా ఆహ్వానించాడు.
Also Read: క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !
ఇంట్లో అంతా తెలుగుతనమే..
తన ఆఖరు రోజుల వరకూ సీకే అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. రాష్ట్రానికి ఆవలనున్నా సీకే ఇంట్లో తెలుగు వాతావరణమే ఉండేదని ఆయన పిల్లలు ఆయన గురించి రాసిన పుస్తకాలలో చెప్పారు. సీకే మరణానంతరం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి మచిలీపట్నంలో ఒక వీధికి సీకే పేరు పెట్టారు. సీకే నాయుడు సోదరుడు సీఎస్ నాయుడు కూడా ప్రముఖ క్రికెటర్. సీకే కుమార్తె చంద్ర నాయుడు భారతదేశంలోని తొలి మహిళా క్రికెట్ కామెంటేటర్ కావడం విశేషం.
Also Read: 'హిట్ మ్యాన్' శకం మొదలు..! కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. కివీస్ సిరీసుకు జట్టు ఎంపిక
సీకే రికార్డులు, ఘనతలు ఇవీ..
భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ 1916లో మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన సీకే తన ఆఖరు మ్యాచ్ ఆడింది 1963లో, 68 ఏళ్ల వయసులో క్రికెట్ చరిత్రలో 48 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్న వారు మరొకరు లేరు. ఫస్ట్ క్లాసు క్రికెట్లో యాభై ఏళ్ళ వయసు దాటాక కూడా డబుల్ సెంచరీ చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్ళలో సీకే ఒకరు. భారత జట్టుకి ఆడినవారిలో "విజ్డెన్" పత్రిక "క్రికెటర్ ఆఫ్ ది ఇయర్"గా 1933లో ఎంపికైన మొదటి వ్యక్తి ఈయన. భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ్ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు సీకే నాయుడు. 1955లో భారత ప్రభుత్వం నుంచి "పద్మ భూషణ్" పురస్కారం అందుకున్నారు.
Also Read: కేన్ మామ వర్సెస్ డేవిడ్ భాయ్.. అరెరే.. పెద్ద సమస్యే వచ్చి పడిందే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి