IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Rape Threats Arrest : క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !

ఓ భారతీయ క్రికెటర్ కుమార్తెపై అత్యాచారం బెదిరింపుల కేసులో ఓ హైదరాబాద్ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకి తరలించారు.

FOLLOW US: 

ఓ భారతీయ క్రికెటర్ కుమార్తెకు ఆన్ లైన్ లో అత్యాచార బెదిరింపులు చేసిన వ్యక్తిని ముంబయి పోలీసులు.. హైదరాబాద్ లో అరెస్టు చేశారు. నిందితుడిని రామనాగేష్ అలీబతినిగా గుర్తించారు. టీ20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్థాన్‌తో టీమిండియా ఓడిపోయిన తర్వాత భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి కుమార్తెపై ఆన్‌లైన్‌లో అత్యాచారం బెదిరింపులు చేశారు. చిన్నారిపై అత్యాచారం తప్పదంటూ హెచ్చరించారు. @Criccrazyygirl అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ బెదిరింపు మెసేజ్ వెళ్లింది. అయితే, ఆ తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబయి సైబర్ సెల్ పోలీసులు విచారణ జరిపి ట్వీట్ చేసిన వ్యక్తిని గుర్తించారు. బుధవారం హైదరాబాద్ లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు రామనాగేష్ అలీబతిని.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అంతకు ముందు ఓ ఫుడ్ డెలివరీ యాప్ కోసం పని చేసేవాడు.

 పాకిస్థాన్​, న్యూజిలాండ్​ చేతుల్లో ఓటమిని సహించలేని కొందరు సామాజిక మాధ్యమాల్లో టీమ్​ఇండియా క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్​కు పాల్పడ్డారు.కొంత మంది గీత దాటి హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా క్రికెటర్ల భార్య, కుమార్తెలను కూడా అసభ్యంగా దూషించారు. క్రికెటర్ కుమార్తె చిన్నారి ఫొటోను విడుదల చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడతామంటూ నీచమైన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Indian Team Squad: 'హిట్‌ మ్యాన్‌' శకం మొదలు..! కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. కివీస్‌ సిరీసుకు జట్టు ఎంపిక

క్రికెటర్ కుమార్తెకు ఆన్‌లైన్ రేప్ బెదిరింపుల నివేదికలపై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) సుమోటోగా విచారణ చేపట్టింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ను ఎఫ్‌ఐఆర్ కావాలని డీసీడబ్ల్యూ కోరింది. నిందితులను గుర్తించి, అరెస్టు చేసిన వారి వివరాలను.. తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరణాత్మక నివేదికను తమకు అందించాలని చెప్పింది. ఈ మేరకు నోటీసును జారీ చేసింది.  విరాట్ కోహ్లీ మరియు అతని కుటుంబాన్ని ఆన్‌లైన్‌లో ట్రోల్ చేయడాన్ని "తీవ్రమైన విషయం"గా డీసీడబ్ల్యూ అభివర్ణించింది..  

Also Read: IPL Update: ఆర్‌సీబీ కోచింగ్‌ యూనిట్‌లో మార్పు.. కొత్త కోచ్‌గా భారత ఆటగాడే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Nov 2021 05:42 PM (IST) Tags: Indian Cricket Anushka Sharma Kohli Hyderabad News T20 World Cup 2021 ind vs pak Virat kohli Daughter Mumbai Police Cyber Cell Ramnagesh Alibathini Indian Cricketer Daughter Rape Threats

సంబంధిత కథనాలు

SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!

SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!

SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!

SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!

SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్

MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్

NTR: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ

NTR: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్‌ పరువు హత్య - రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే

Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్‌ పరువు హత్య -  రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే