Telegram New Feature: టెలిగ్రామ్ యూజర్లకు కొత్త ఫీచర్ - ఇకపై థర్డ్ పార్టీ సర్వీసుల ద్వారా?
Telegram Privacy Feature: టెలిగ్రామ్ తన యూజర్లకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై థర్డ్ పార్టీ సర్వీసుల ద్వారా కూడా అకౌంట్లను వెరిఫై చేయనుంది.
Telegram Third Party Verification: టెలిగ్రామ్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. తప్పుడు సమాచారాన్ని ఆపడానికి, స్కామ్‌ల నుండి వినియోగదారులను రక్షించడానికి ఈ ఫీచర్ ప్రవేశపెట్టారు. ఇందులో అధికారిక థర్డ్ పార్టీ సర్వీసుల ద్వారా యూజర్ అకౌంట్లు, ఛాట్‌లలో అదనపు వెరిఫికేషన్ సింబల్స్‌ను ఉంచగలవు. ఇది కంపెనీ ప్రస్తుత ధృవీకరణ ప్రక్రియకు భిన్నంగా ఉంటుంది. ఇందులో పబ్లిక్ ఫిగర్‌లు, కంపెనీలకు వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లు అందిస్తారు. కొత్త ఫీచర్ వల్ల వినియోగదారులు విశ్వసనీయమైన ఖాతాలను గుర్తించడం మరింత సులభతరం అవుతుంది. దీంతో పాటు వారు మోసాలను కూడా నివారించగలుగుతారు.
కొత్త ఫీచర్‌లో ఏం ఉంటుంది?
కొత్త ఫీచర్ తర్వాత విశ్వసనీయ థర్డ్ పార్టీ సర్వీస్‌లు అదనపు వెరిఫికేషన్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటాయి. ఇప్పుడు థర్డ్ పార్టీ సర్వీసు ద్వారా వెరిఫైడ్ అకౌంట్ లేదా ఛాట్ దాని పేరుకు ముందు చిన్న లోగోను కలిగి ఉంటుంది. ఇది కాకుండా అకౌంట్ స్టేటస్‌కు సంబంధించిన డిటైల్స్ కూడా దానితో అసోసియేటెడ్ ప్రొఫైల్‌లో అందుబాటులో ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు వినియోగదారులు ఏదైనా వెరిఫైడ్ సర్వీసు గురించి తెలుసుకోవడానికి మునుపటి కంటే ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉంటారు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
వెరిఫైడ్ థర్డ్ పార్టీ మాత్రమే వెరిఫికేషన్ చేయగలదు...
థర్డ్-పార్టీ సర్వీస్‌లు మాత్రమే వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను ఇవ్వగలవని, అవి ఇప్పటికే స్వయంగా వెరిఫై అయ్యాయని టెలిగ్రామ్ తెలిపింది. దీని కోసం వారు అప్లికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. సంవత్సరం మొదటి అప్‌డేట్‌లో, టెలిగ్రామ్ బహుమతులు, సర్వీస్ మెసేజ్‌లకు రియాక్షన్లు, ఎక్స్‌ట్రా మెసేజ్ సెర్చ్ ఫిల్టర్‌లు, అనేక ఇతర అప్‌డేట్‌లతో పాటు ఈ ఫీచర్‌ను తీసుకువచ్చింది.
టెలిగ్రామ్ ఈ అప్‌డేట్‌లన్నింటినీ 2024 చివరి రోజున విడుదల చేయాల్సింది. కానీ అలా చేయలేకపోయింది. దీని వెనుక ఉన్న కారణాన్ని తెలియజేస్తూ యాపిల్ సమీక్ష బృందం వాటిని సమయానికి సమీక్షించలేదని, ఈ కారణంగా కొన్ని రోజుల తర్వాత ఈ అప్‌డేట్ వచ్చిందని కంపెనీ తెలిపింది. టెలిగ్రామ్‌కు నెలవారీ 9.5 కోట్ల మంది యాక్టివ్ యూజర్‌లు ఉన్నారు. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
Telegram’s latest update launched collectible gifts – with over 1400 unique appearances and even more to come. These gifts can be traded to other Telegram users or auctioned on NFT marketplaces.
— Telegram Messenger (@telegram) January 3, 2025
All the details (and 5 more features) are on our blog:https://t.co/Mi5kzxQLsQ
Telegram is now profitable 🏆
— Pavel Durov (@durov) December 23, 2024
📈 This year, the number of Telegram Premium subscribers tripled, exceeding 12 million. Our ad revenue also increased a few times. Telegram's total revenue in 2024 surpassed $1 billion, and we are closing the year with more than $500 million in cash…