Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
Game Changer Pre Release Event LIVE Updates: ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి పవన్ కళ్యాణ్ ఓ సినిమా వేడుకకు వస్తున్నారు. అదీ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు. ఆ లైవ్ హైలైట్స్...
LIVE

Background
ఏపీని చిన్నచూపు చూడకండి - దిల్ రాజుకు పవన్ సూచన
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక సూచన చేశారు. తమ రాష్ట్రాన్ని చిన్నచూపు చూడవద్దని ఆయన కోరారు. రెండు రాష్ట్రాలలో చిత్ర పరిశ్రమల అభివృద్ధి చేయాలని తెలిపారు. చిత్ర సీమలో వివిధ శాఖలలో యువత నైపుణ్యం సాధించేలా ఏపీలో స్టంట్ స్కూల్స్ పెట్టాలని, రాజమౌళి త్రివిక్రమ్ లాంటి దిగ్గజ దర్శకులతో స్క్రీన్ ప్లే - స్క్రిప్ట్ వాకింగ్ క్లాసులు తీసుకోవాలని, కీరవాణి - తమన్ వంటి సంగీత దర్శకులతో అవగాహన పెంపొందించాలని పవన్ కోరారు.
బాక్స్ ఆఫీస్ బద్దలు కావాలి, భారీ విజయం సాధించాలి - పవన్
'గేమ్ చేంజర్' సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కావాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన సినిమాలకు ఆ విధంగా చెప్పడం తనకు నచ్చదని, రామ్ చరణ్ సినిమా భారీ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
కూటమి ప్రభుత్వానికి వివక్ష లేదు... మద్దతు తెలపని వారికి రేట్లు పెంచాం - పవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఎవరి మీద వివక్ష లేదని పవన్ స్పష్టం చేశారు. తమ కూటమికి మద్దతు తెలపని హీరోల సినిమాలకు సైతం టికెట్ రేట్లు పెంచినట్లు ఆయన వివరించారు. చిత్రసీమను చిత్ర సీమగా మాత్రమే చూస్తామని, సినిమాల్లో రాజకీయాలను తీసుకురామని పవన్ కళ్యాణ్ సుస్పష్టంగా తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ తనకు వ్యతిరేకంగా సినిమాలు చేసిన కోటా శ్రీనివాసరావు, ఘట్టమనేని కృష్ణతో చక్కగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని, ఆ విలువలను తాము కొనసాగిస్తున్నామని పవన్ తెలిపారు.
టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది - పవన్
సినిమా టికెట్ రేట్లు పెంచడం పట్ల చాలా మందిలో అపోహలు ఉన్నాయని, బ్లాక్ లో టికెట్టు కొని సినిమా చూడడం వల్ల అది ఎవరెవరి జేబుల్లోకి వెళుతుందో తెలియదని, టికెట్ రేటులో పెంచిన ప్రతి రూపాయి మీద ప్రభుత్వానికి 18 శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందని పవన్ తెలిపారు. కోట్లకు కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సినిమాలో తీసే నిర్మాతలకు టికెట్ రేట్లు పెంచడం వల్ల కొంత సహాయం అందుతుందన్నారు.
హీరోల అందరికీ చరణ్ మిత్రుడు... అందరూ సినిమా చూడాలి - పవన్
మెగా అభిమానులు అని చెప్పడం తమకు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి ఒక్క అభిమాని సినిమా చూడాలని, ఇవాళ ఇక్కడికి వచ్చిన వారిలో ఇతర హీరోల అభిమానులు కూడా ఉంటారని పవన్ పేర్కొన్నారు. హీరోలు అందరికీ చరణ్ మిత్రుడు అని, సినిమాను అందరూ చూడాలని పవన్ కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

