Game Changer Ticket Rates Fix | గేమ్ ఛేంజర్ కి రేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్ | ABP Desam
ఏపీలో గేమ్ ఛేంజర్ సినిమా టిక్కెట్లు రేట్లు ప్రకటించారు. తెలంగాణలో పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన ఘటనతో ఏపీలో కొత్త సినిమాలకు ఏమైనా మార్పులు ఉంటాయేమో అని కంగారు పడిన ఫ్యాన్స్ ఊపిరి తీసుకునేలా ఏపీ సర్కార్ నిర్ణయాలను వెలువరించింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు మొదటి రోజు 7 షోలు వేసుకునేందుకు అనుమతులు లభించాయి. అర్థరాత్రి 1గంటలకు మొదలయ్యే బెనిఫిట్ షో కు 600 రూపాయలు టికెట్ రేట్ పెట్టుకోవచ్చని ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంతే కాదు సినిమా విడుదలయ్యే జనవరి 10 నుంచి 23వ తారీఖు వరకూ టికెట్ రేట్లను కూడా పెంచింది. మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ రేట్ మీద 175 రూపాయలు..సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 135 రూపాయలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో గేమ్ ఛేంజర్ ప్రీమియర్స్ మాత్రం పడటం లేదు. మొదటి రోజు 1గంటకు బెనిఫిట్ షో ఉండగా..ఉదయం 4గంటల నుంచి నార్మల్ షోస్ మొదలు కానున్నాయి





















