అన్వేషించండి

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు

అటు బ్యాటింగ్ తోపాటు ఇటు బౌలింగ్ లో రాణించడంతో అండర్ 19 టీ20 ఆసియాకప్ ను భారత్ సాధించింది. తొలుత త్రిష బ్యాటింగ్ లోరాణించగా, చిన్న లక్ష్యాన్ని భారత స్పిన్నర్లు నిలబెట్టుకున్నారు. 

Gongadi Trisha Updates: తెలంగాణ ప్లేయర్ గొంగిడి త్రిష (47 బంతుల్లో 52, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడంతో ఇనాగురల్ అండర్ -19 మహిళా ఆసియాకప్ ను భారత్ దక్కించుకుంది. ఈ టోర్నీలో ఆద్యంతం పరుగుల వరద కనబర్చిన త్రిష.. ఫైనల్లోనూ తన సత్తాచాటింది. దీంతో ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ ను 41 పరుగులతో ఓడించిన భారత్, తొలిసారి విజేతగా రికార్డులకెక్కింది. ముఖ్యంగా బౌలర్లు కూడా రాణించడంతో 118 పరుగుల చిన్న లక్ష్యాన్ని భారత్ కాపాడుకుంది. భారత స్పిన్ త్రయం ఏడు వికెట్లు తీసి బంగ్లా నడ్డి విరిచారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన భారత మహిళా జట్టు.. విజేతగా నిలిచింది. 

త్రిష వన్ విమెన్ షో..
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించ లేక పోయింది. నిర్ణీత 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగుల స్కోరే చేయగలిగింది. తెలంగాణలోని భద్రాచలంకు చెందిన  బ్యాటర్ త్రిష (52) అర్ధ సెంచరీతో సత్తా చాటి, జట్టు విజయంలో కీలకపాత్ర  పోషించింది.. ఒక వైపు వికెట్లు పడతున్నా ఓపికగా ఆడి, ఫిఫ్టీ సాధించింది. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగెలెత్తించింది.  దీంతో భారత్ కు పోరాడగలిగే స్కోరును అందించింది. మిగతా బ్యాటర్లలో మిథిలా 17 పరుగుల కీలక రన్స్ సాధించింది. ఫైనల్ ఓవర్లో రెండు బౌండరీలు సాధించిన మిథాల సత్తా చాటింది. ఇక బౌలర్లలో ఫర్జానా (4/31)తో సత్తా చాటింది. యువ సంచనలం కమలినితో సహా సానిక, త్రిష, మిథిలాలను ఔట్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేసింది. అలాగే మరో బౌలర్ నితీషా రెండు వికెట్లతోరాణించింది. హబీబాకు ఒక వికెట్ దక్కింది. 

తిప్పేశారు..
బంతికొక పరుగు సాదించినా తేలికగా గెలిచే మ్యాచ్ ను బంగ్లాదేశ్ చేజార్చుకుంది. ముఖ్యంగా స్పిన్ త్రయం పారునిక సిసోడియా, ఆయూషి శుక్లా, సోనమ్ యాదవ్ బంగ్లా బౌలర్లను రఫ్ఫాడించారు. గింగరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థి పని పట్టారు. ముఖ్యంగా ఆయూషి (3/17) కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ గా కనిపించింది.  వీరు ముగ్గురే ఏకంగా ఏడు వికెట్లు సాధించడం విశేషం. దీంతో బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో జువైరియా ఫిర్దోస్ (22), ఫహోమిదా చోయ (18) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. 


టోర్నీలో రెండు అర్థసెంచరీలు సహా 159 పరుగులతో టాప్ లేపిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా త్రిషకే లభించడం విశేషం. ఓపెనర్ నిలకడగా రాణించి, జట్టు విజయాల్లో త్రిష కీలక పాత్ర పోషించింది. 

Also Read: Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Team Davos: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 186శాతం పెన్షన్ పెరుగుదల అందుతుందా?
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 186శాతం పెన్షన్ పెరుగుదల అందుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bihar DEO Bundles of Cash | అధికారి ఇంట్లో తనిఖీలు..నోట్ల కట్టలు చూసి షాక్ | ABP DesamRam Gopal Varma Convicted Jail | సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీకి జైలు శిక్ష | ABP DesamNara Lokesh Davos Interview | దావోస్ సదస్సుతో ఏపీ కమ్ బ్యాక్ ఇస్తుందన్న లోకేశ్ | ABP DesamCM Chandrababu Naidu Davos Interview | మనం పెట్టుబడులు అడగటం కాదు..మనోళ్లే ఎదురు పెడుతున్నారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Team Davos: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 186శాతం పెన్షన్ పెరుగుదల అందుతుందా?
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 186శాతం పెన్షన్ పెరుగుదల అందుతుందా?
Anantapur News: ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు  -  ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ?   అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు - ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ? అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
Bill Gates : నాలుగో తరగతిలో బిల్ గేట్స్ రాక్స్ - టీచర్ షాక్స్ - ఆవు మూత్రపిండాలు తీసుకెళ్లాడట మరి !
నాలుగో తరగతిలో బిల్ గేట్స్ రాక్స్ - టీచర్ షాక్స్ - ఆవు మూత్రపిండాలు తీసుకెళ్లాడట మరి !
Pregnant Woman in America: సిజేరియన్లకు పరుగులు పెడుతున్న ప్రెగ్నెంట్ మహిళలు - పిల్లలకు పౌరసత్వం కోసం అమెరికాలో కొత్త హడావుడి !
సిజేరియన్లకు పరుగులు పెడుతున్న ప్రెగ్నెంట్ మహిళలు - పిల్లలకు పౌరసత్వం కోసం అమెరికాలో కొత్త హడావుడి !
Embed widget