Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
NTR Neel Cinema: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ గురించి డైరెక్టర్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అది ఏమిటంటే?

NTR Prashanth Neel Movie Update : మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ ఎటువంటి సినిమా తీయబోతున్నారు? వాళ్ళిద్దరి కలయికలో ఎటువంటి సినిమా రానుంది? ఇటువంటి ప్రశ్నలకు తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారు? అనే వివరాల్లోకి వెళితే...
ఎన్టీఆర్ సినిమా బ్యాక్ డ్రాప్ మైథాలజీ కాదు!
మైథాలజీ బ్యాక్ డ్రాప్ సినిమా ఒకటి చేయాలని ప్రశాంత్ నీల్ ఆ మధ్య ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ హీరోగా చేయబోయే సినిమా కోసమే ఆ బ్యాక్ డ్రాప్ అనుకున్నారా? అని తాజా ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురైంది. అప్పుడు ప్రశాంత్ నీల్... ''లేదు. అది మైథాలజీ బ్యాక్ డ్రాప్ కాదు. ఎన్టీఆర్ హీరోగా చేయబోయేది పిరియాడిక్ బాక్ డ్రాప్ సినిమా'' అని సమాధానం ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ నీల్ (NTR Neel Movie) ఎప్పుడు స్టార్ట్ అయ్యేది ఆయన చెప్పలేదు.
ప్రస్తుతం బాలీవుడ్ సినిమా 'వార్ 2' చిత్రీకరణలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. అది పూర్తి అయ్యాక ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనుంది. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు.
డ్రాగన్... ఎన్టీఆర్ నెల్ సినిమా టైటిల్ అదేనా?!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలోని సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కానీ, దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో మొదలుపెట్టారు. ఈ సినిమా కథ మీద చాలా రోజుల నుంచి ఆయన వర్క్ చేస్తున్నారు. అంటే కాదు... సినిమా టైటిల్ కూడా ఖరారు చేశారని మైత్రి మూవీ మేకర్స్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ సినిమాకు డ్రాగన్ అని టైటిల్ పెట్టారట. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ డ్రాగన్ ఎలా ఉంటుందో షూటింగ్ మొదలైతే గాని లీకులు బయటకు రావు. అప్పటివరకు యంగ్ టైగర్ ఫాన్స్ వెయిట్ చేయాల్సిందే.
ఎన్టీఆర్ సరసన కథానాయికగా రుక్మిణి వసంత్!
ఎన్టీఆర్ నీల్ సినిమాలో కథానాయికగా ఇప్పటి వరకు ఎన్టీఆర్ సరసన నటించని అమ్మాయిని ఎంపిక చేశారు ప్రశాంత్ నీల్. కన్నడ కథానాయకుడు రిషబ్ శెట్టి సరసన 'సప్త సాగరాలు దాటి' సినిమాలో నటించిన రుక్మిణి వసంత్ గుర్తు ఉన్నారా? ఇటీవల నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన 'అప్పుడో ఎప్పుడో ఎప్పుడో' సినిమాలోనూ కనిపించారు. ఆ అమ్మాయి ఎన్టీఆర్ జోడిగా సినిమాలో సందడి చేయనున్నారు. నిజానికి ఈ సినిమాతో ఆవిడ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కన్నడ సినిమాల కంటే ముందు ఈ సినిమా చేశారు. కానీ విడుదల ఆలస్యం కావడం ఆశించిన స్థాయిలో సినిమా విజయం కాకపోవడంతో అది మరుగున పడింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రాపర్ డెబ్యూ అని రుక్మిణి వసంత్ భావిస్తున్నారు. సినిమాలో ఆవిడ రోల్ ఉంటుందో మరి?
Also Read : అమెజాన్ సబ్ స్క్రైబర్లకు బ్యాడ్ న్యూస్... పాస్ వర్డ్ షేరింగ్ రూల్స్ మారుతున్నాయ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

