
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
Dhop Song : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబో మూవీ ‘గేమ్ చేంజర్’ నుండి నాల్గవ పాట ‘డోప్’ వచ్చేసింది. శంకర్ పాటల్లో ఉండే భారీతనాన్ని భారీగా నింపుకుని వచ్చిన ఈ ‘డోప్’ లిరికల్ సాంగ్ ఎలా ఉందంటే..

Game Changer Dhop Lyrical Song : డిసెంబర్‌లో ‘పుష్ప 2’ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇప్పుడందరి కళ్లు సంక్రాంతి మూవీస్‌పైనే ఉన్నాయి. అందులోనూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘గేమ్ చేంజర్’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. వాస్తవానికి ‘గేమ్ చేంజర్’ సినిమా కూడా డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సంక్రాంతికి వాయిదా పడింది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి తన ‘విశ్వంభర’ విడుదల తేదీని త్యాగం చేసి మరీ ఈ ‘గేమ్ చేంజర్’కు లైన్ క్లియర్ చేశారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ పీక్‌లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుండి నాల్గవ సాంగ్ ‘డోప్’ని ఆదివారం ఉదయం అమెరికాలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ఎలా ఉందంటే..
‘గేమ్ చేంజర్’ నుండి ఇప్పటి వరకు విడుదలైన.. ‘జరగండి జరగండి’, ‘రా మచ్చా మచ్చా రా’, ‘నా నా హైరానా’ అనే పాటలు ఒకదానిని మించి ఒకటి అన్నట్లుగా చార్ట్ బస్టర్స్‌లో నిలిచి ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు విడుదలైన ‘డోప్’ సాంగ్ కూడా వాటికి ఏమాత్రం తగ్గని విధంగా.. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా మ్యూజిక్ స్టాండర్డ్స్‌ని పెంచే విధంగా పాటకి పాట, డ్యాన్స్ కి డ్యాన్స్ ఇలా ప్రతీది హైలెట్ అనేలా ఉన్నాయి. ఈ పాట విడుదలకు ముందు.. చిత్రయూనిట్, సింగర్ గీతా మాధురి, డ్యాన్స్ మాస్టర్ జానీ.. ‘డోప్’ వేరే లెవల్ అంటూ పాటపై భారీగా హైప్‌ని పెంచేశారు. ఆ హైప్‌కి తగ్గట్టే ఈ పాట అంచనాలను అందుకుందని చెప్పవచ్చు.
చిన్న ప్రోమోతోనే పిచ్చలేపిన ఈ ‘డోప్’ సాంగ్.. ఫుల్ సాంగ్ విన్న తర్వాత రిపీటెడ్ మోడ్ అన్నట్లుగా ప్రేక్షకుల నుండి ఆదరణను రాబట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్, కియారా కెమిస్ట్రీ.. వారి మెస్మరైజింగ్ డ్యాన్స్ మూమెంట్స్, థమన్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ప్రతీది కూడా డీప్‌గా ఎక్కేస్తున్నాయి. అస్సలు దిగమన్నా దిగట్లే. అలా ఈ పాటకి టీమ్ అంతా ప్రాణం పెట్టేశారు. థమన్ మొదటి నుండి చెప్పినట్లుగా ఈ పాటలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. థమన్ ఇప్పటి వరకు ఎన్ని పాటలు చేసినా.. వాటన్నింటిలో బెస్ట్ అనేలా ఈ పాటని స్వరపరిచాడు. ప్రస్తుతం ఈ పాట విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ట్రెండ్‌లోకి వచ్చేసింది. సినిమాపై ఈ పాట భారీ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
సంక్రాంతి కానుకగా.. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘పుష్ప2’ లానే ‘గేమ్ చేంజర్’ కూడా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
Also Read: టాలీవుడ్ మీద 'పుష్ప 2' ఎఫెక్ట్... ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ - టికెట్ రేట్లూ పెరగవ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

