Shahid Afridi on Virat Kohli: కోహ్లీ అన్నింట్లో కెప్టెన్సీ వదిలేస్తే మంచిది.. రోహిత్‌కు అఫ్రిది మద్దతు
కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ వదిలేసి ఆటను ఆస్వాదించాలని అఫ్రిది అంటున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా సరైనవాడని పేర్కొన్నాడు.
![Shahid Afridi on Virat Kohli: కోహ్లీ అన్నింట్లో కెప్టెన్సీ వదిలేస్తే మంచిది.. రోహిత్‌కు అఫ్రిది మద్దతు For greater success as batsman, Virat Kohli should give up captaincy in all formats: Shahid Afridi Shahid Afridi on Virat Kohli: కోహ్లీ అన్నింట్లో కెప్టెన్సీ వదిలేస్తే మంచిది.. రోహిత్‌కు అఫ్రిది మద్దతు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/08/a98ff7169feb42c2ca6ee33c7484f235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టీమ్‌ఇండియాకు అన్ని ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ సారథ్యాన్ని వదిలేస్తే మంచిదని పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది అంటున్నాడు. నాయకత్వ బాధ్యతలను వదిలేయడం వల్ల బ్యాటర్‌గా రాణించగలడని పేర్కొన్నాడు. రోహిత్ శర్మలో అన్ని నైపుణ్యాలూ ఉన్నాయని వెల్లడించాడు. అతడిని టీ20 సారథిగా ఎంపిక చేయడంపై స్పందించాడు.
'భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన శక్తి! అయితే అన్ని ఫార్మాట్లలో అతడు నాయకత్వాన్ని వదిలేస్తే ఇంకా బాగుంటుంది' అని అఫ్రిది అన్నాడు. 'నేను రోహిత్‌శర్మతో కలిసి ఒక ఏడాది ఆడాను. అతడో గొప్ప ఆటగాడు. మంచి వ్యక్తిత్వం గలవాడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలో ఎప్పుడు దూకుడుగా ఉండాలో అతడికి బాగా తెలుసు' అని పేర్కొన్నాడు.
మంచి కెప్టెన్ అయ్యే మానసిక దృఢత్వం రోహిత్ శర్మకు ఉన్నాయని అఫ్రిది అన్నాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఆడుతూ దాన్నతడు చూపించాడని పేర్కొన్నాడు. 'అతడో అత్యున్నత స్థాయి ఆటగాడు. మంచి షాట్లను ఎంపిక చేసుకుంటాడు. గొప్ప నాయకుడు కాగల వైఖరి, దృఢత్వం అతడికి ఉన్నాయి' అని తెలిపాడు. దక్కన్ ఛార్జర్ తరఫున రోహిత్‌తో కలిసి అఫ్రిది ఆడాడు.
కోహ్లీ సారథ్యాన్ని వదిలేస్తాడని తాను ఎప్పట్నుంచో అంచనా వేస్తున్నానని అఫ్రిది అన్నాడు. అతడు మిగతా ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ వదిలేసి ఆటను ఎంజాయ్ చేయాలని సూచించాడు. అప్పుడుతను స్వేచ్ఛగా టన్నుల కొద్దీ పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా తనలోని అత్యుత్తమ ఆటను బయట పెట్టగలడని వివరించాడు.
Also Read: India Tests Squad Against NZ: టీమ్‌ఇండియాలోకి విశాఖ కుర్రాడు.. కివీస్ టెస్టు సిరీసుకు భారత జట్టిదే
Also Read: T20 WC 2021: 4 జట్లతో ఆడుకున్న '6' సెంటిమెంట్..! ముందు విజయం సెమీస్‌లో పరాభవం..!
Also Read: Hasan Ali Troll: హసన్ అలీకి అండగా భారతీయులు.. పాక్ పేసర్‌కు మద్దతుగా #INDwithHasanAli ట్రెండింగ్
Also Read: AUS Vs NZ: కేన్ మామ వర్సెస్ డేవిడ్ భాయ్.. అరెరే.. పెద్ద సమస్యే వచ్చి పడిందే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)