India Tests Squad Against NZ: టీమ్‌ఇండియాలోకి విశాఖ కుర్రాడు.. కివీస్ టెస్టు సిరీసుకు భారత జట్టిదే
న్యూజిలాండ్ మరికొన్ని రోజుల్లో భారత్‌లో పర్యటించనుంది. ఇప్పటికే టీ20 సిరీసుకు జట్టును ప్రకటించిన బీసీసీఐ తాజాగా టెస్టు సిరీసుకు ఎంపిక చేసింది.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీసుకు బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది. అజింక్య రహానెను కెప్టెన్‌గా చెతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. తొలి టెస్టులో విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడు రెండో టెస్టు నుంచి అందుబాటులో ఉంటాడు. నాయకత్వ బాధ్యతలు తీసుకుంటాడు.
రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో ఆంధ్రా కుర్రాడు కోన శ్రీకర్ భరత్‌కు రెండో ప్రధాన్య కీపర్‌గా చోటు దక్కింది. అన్నీ కుదిరితే శ్రేయస్ అయ్యర్ సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇన్నాళ్లూ బయోబుడగలో ఉండి మానసికంగా అలసిపోయిన జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీకి కాస్త విరామం ఇచ్చారు. ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మకు తోడుగా ప్రసిద్ధ కృష్ణ, మహ్మద్ సిరాజ్ జట్టులో ఉన్నారు. నలుగురు స్పిన్నర్లకు చోటు దక్కింది.
మొదటి టెస్టు కాన్పూర్ వేదికగా నవంబర్ 25న మొదలవుతుంది. డిసెంబర్ 3 నుంచి ముంబయిలో జరుగుతుంది. ఈ సిరీసు ముగిసిన తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్తుంది.
భారత జట్టు
అజింక్య రహానె (కెప్టెన్)
చెతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్)
కేఎల్ రాహుల్
మయాంక్ అగర్వాల్
శుభ్‌మన్ గిల్
శ్రేయస్ అయ్యర్
వృద్ధిమాన్ సాహా (కీపర్)
కేఎస్ భరత్ (కీపర్)
రవీంద్ర జడేజా
రవిచంద్రన్ అశ్విన్
అక్షర్‌పటేల్
జయంత్ యాదవ్
ఇషాంత్ శర్మ
ఉమేశ్ యాదవ్
మహ్మద్ సిరాజ్
ప్రసిద్ధ్ కృష్ణ
#TeamIndia squad for NZ Tests:
— BCCI (@BCCI) November 12, 2021
A Rahane (C), C Pujara (VC), KL Rahul, M Agarwal, S Gill, S Iyer, W Saha (WK), KS Bharat (WK), R Jadeja, R Ashwin, A Patel, J Yadav, I Sharma, U Yadav, Md Siraj, P Krishna
*Virat Kohli will join the squad for the 2nd Test and will lead the team. pic.twitter.com/FqU7xdHpjQ
Also Read: Team India: న్యూజిలాండ్ తో టీట్వంటీ సిరీస్ జట్టును ప్రకటించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ
Also Read: T20 World Cup 2021 : T20 వరల్డ్ కప్ ఫైనల్ చేరుకున్న చిరకాల ప్రత్యర్థులు
Also Read: T20 World Cup: మనోళ్లు ఐపీఎల్‌ను తిడుతుంటే..! కేన్ మామ మాత్రం ఐపీఎల్ వల్లే సెమీస్ చేరామన్నాడు!
Also Read: Watch Video: పాకిస్తాన్ ఓటమిని జీర్ణించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చిన బాలుడు.. వీడియో షేర్ చేసిన అక్తర్