T20 World Cup: మనోళ్లు ఐపీఎల్‌ను తిడుతుంటే..! కేన్ మామ మాత్రం ఐపీఎల్ వల్లే సెమీస్ చేరామన్నాడు!
ప్రపంచకప్‌లో భారత నిష్క్రమణకు ఐపీఎల్ కారణమని మనోళ్లు తిడుతున్నారు. కివీస్‌ను ఫైనల్‌కు చేర్చిన విలియమ్సన్ మాత్రం ఐపీఎల్ వల్లే విజయాలు అందుకున్నామని అంటున్నాడు.
ఒకవైపు టీమ్‌ఇండియా ప్రపంచకప్ సెమీస్ చేరనందుకు ఐపీఎల్ కారణమని విమర్శిస్తుంటే మరోవైపు తాము సెమీస్ చేరేందుకు అదే ఐపీఎల్ ఉపయోగపడిందని కివీస్ సారథి కేన్ విలియమ్సన్ అంటున్నాడు. లీగులో ఆడటం వల్లే యూఏఈ పరిస్థితులు అర్థమయ్యాయని, తమ ఆటగాళ్లు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డారని తెలిపాడు. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై ఘన విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
'ఐపీఎల్ మాకెంతగానో ఉపయోగపడింది. నాతో సహా మా ఆటగాళ్లలో చాలామంది వేర్వేరు ఫ్రాంచైజీ శిబిరాల్లో గడిపాం. యూఏఈ పరిస్థితులు, ఇతర దేశాల ఆటగాళ్ల గురించి అవగాహన పెంచుకున్నాం. అంతేకాకుండా మిగతా ఆటగాళ్లతో అనుభవాలు పంచుకున్నాం. ఇక్కడి పిచ్‌ల్లోని వైవిధ్యం అర్థం చేసుకున్నాం. ఏదేమైనా వేర్వేరు మ్యాచుల్లో కొద్ది పాటి తేడాతో మేం గెలిచాం' అని కేన్ అన్నాడు.
టీమ్‌ఇండియా సెమీస్ చేరకపోవడంతో మాజీ క్రికెటర్లు ఐపీఎల్‌ను నిందించిన సంగతి తెలిసిందే. కపిల్‌దేవ్ సహా చాలామంది క్రికెట్ లీగు వల్లే భారత్ ఓడిపోయిందని విమర్శించారు. ఆటగాళ్లు దేశం కన్నా లీగుకే ఎక్కువ విలువిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలోనూ ఐపీఎల్‌పైనే విమర్శలు చెలరేగాయి.
అబుదాబి వేదికగా బుధవారం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీస్‌లో తలపడ్డ సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన ఆంగ్లేయులు 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేశారు. డేవిడ్ మలన్ (41), మొయిన్ అలీ (51) రాణించారు. అయితే కివీస్ ఛేదన ఆసక్తికరంగా సాగింది. గప్తిల్ (4), విలియమ్సన్ (5) త్వరగా ఔటయ్యారు. 100 పరుగులు చేసేందుకు ఆ జట్టు 15 ఓవర్లు తీసుకుంది. విజయానికి 30 బంతుల్లో 60 పరుగులు అవసరమైన దశలో మిచెల్ (72*), డేవాన్ కాన్వే (46), జిమ్మీ నీషమ్ (27; 11 బంతుల్లో) సిక్సర్లు దంచేసి మరో 6 బంతులు మిగిలుండగానే ఛేదన ముగించారు.
Also Read: Rape Threats Arrest : క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !
Also Read: ENG vs NZ, Match Highlights: మొదటిసారి ఫైనల్స్‌కు న్యూజిలాండ్.. బై.. బై.. ఇంగ్లండ్
Also Read: Ravi Shastri Backs Dravid: తాను చేయలేనిది ద్రవిడ్ చేయాలన్న రవిశాస్త్రి..! కొత్త కోచ్‌కు అభినందనలు
Also Read: IPL Update: ఆర్‌సీబీ కోచింగ్ యూనిట్‌లో మార్పు.. కొత్త కోచ్‌గా భారత ఆటగాడే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి