Ravi Shastri Backs Dravid: తాను చేయలేనిది ద్రవిడ్ చేయాలన్న రవిశాస్త్రి..! కొత్త కోచ్‌కు అభినందనలు
కొత్త కోచ్ ద్రవిడ్‌కు రవిశాస్త్రి అభినందనలు తెలిపాడు. ఇండియన్ క్రికెట్ ప్రమాణాలు పెంచాలని కోరాడు. ఐసీసీ ట్రోఫీలు అందించాలని కోరుకున్నాడు.

టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అద్భుతంగా రాణించగలడని రవిశాస్త్రి అంచనా వేశాడు. అతడు జట్టు ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్లగలడని ధీమా వ్యక్తం చేశాడు. మిస్టర్ డిపెండబుల్‌కు అభినందనలు తెలియజేశాడు. తనతో కలిసి పనిచేసిన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌పై ప్రశంసలు కురిపించాడు. సోమవారం శాస్త్రి మీడియాతో మాట్లాడాడు.
'గొప్ప జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్ కాబోతున్నాడు. ఒక ఆటగాడిగా, కోచ్‌గా తన అనుభవంతో జట్టు ప్రమాణాలను పెంచాలని కోరుకుంటున్నా' అని రవిశాస్త్రి అన్నాడు. 'ఒకే ఒక్కటి మిస్సవుతున్నా. అదే ఐసీసీ టోర్నీలు గెలవడం! రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో ఆ అవకాశం వస్తుందని అనుకుంటున్నా. అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అతడో గొప్ప ఆటగాడు. గొప్ప స్థాయి ఉంది. ఇప్పటికే కోచ్‌గా రాణించాడు. ఇప్పుడీ జట్టు బాధ్యతలు చేపట్టబోతున్నాడు' అని శాస్త్రి తెలిపాడు.
తనతో కలిసి పనిచేసిన సహచరులకు శాస్త్రి కృతజ్ఞతలు తెలిపాడు. 'నేనైతే భరత్ అరుణ్‌ను బౌలింగ్ శాఖకు గురువుగా చెబుతాను. అతడు, శ్రీధర్ అద్భుతంగా పనిచేశారు. ముందు అరుణ్ గురించే మాట్లాడతా. దాదాపు 20 ఏళ్లుగా కోచింగ్‌లో అతడికి అనుభవం ఉంది. ఆటగాళ్లనే కాదు ఎంతో మంది కోచ్‌లకు అతడు కోచింగ్ ఇచ్చాడు. ఎన్నో కోర్సులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చి ఇక్కడికొచ్చాడు. అందుకే అతడిని ఎంపిక చేసుకున్నా' అని శాస్త్రి తెలిపాడు.
చక్కగా కమ్యూనికేట్ చేయగలగలడమే భరత్ అరుణ్‌లోకి ప్రత్యేకతగా శాస్త్రి కొనియాడాడు. 'అతడికి ఇష్టమొచ్చినట్టుగా ఆటగాళ్ల టెక్నిక్‌ను మార్చుకోమనడు. తన వద్ద పరిష్కారం ఉంటేనే సూచనలు ఇస్తాడు. తన కమ్యూనికేషన్ నైపుణ్యాల ద్వారా జట్టులో ప్రొఫెషనలిజంను ప్రవేశపెట్టాడు. వ్యక్తిగతంగా కాకుండా బౌలింగ్ జట్టుగా లక్ష్యాలు నిర్దేశిస్తాడు' అని తెలిపాడు.
ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డింగ్ కోచుల్లో ఆర్.శ్రీధర్ ఒకరని శాస్త్రి అన్నాడు. భారత చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డింగ్ జట్టుగా రూపుదిద్దాలని అతడిని ఆదేశించానన్నాడు. మ్యాచు మ్యాచుకూ దాన్నతడు చేసి చూపించాడని వెల్లడించాడు. అతడూ ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటాడని పేర్కొన్నాడు.
Also Read: T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ముందుగానే నిష్క్రమించటానికి ప్రధాన కారణాలేంటి?
Also Read: Kohli as T20 Captain: ఆ విషయంలో కోహ్లీని కొట్టేవాళ్లే లేరు.. ఇప్పటికీ నెంబర్ వన్‌నే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

