Candice Warner on Twitter: హేళన చేయకు బ్రో.. సన్‌రైజర్స్‌కు సరైన రిప్లై ఇచ్చిన వార్నర్ భార్య
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ భార్య కాండీస్ వార్నర్ సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు చురకలు అంటించింది.
టీ20 వరల్డ్‌కప్‌లో 289 పరుగులతో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. కప్ గెలుచుకున్నందుకు ఆస్ట్రేలియాను అన్ని ఐపీఎల్ టీమ్స్ అభినందించగా.. సన్‌రైజర్స్ మాత్రం కిక్కురుమనలేదు. ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దానికి కారణం.. ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్ వైఫల్యానికి డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్‌ను దారుణంగా ట్రీట్ చేయడమే.
దీనికి తోడు సన్‌రైజర్స్ యాజమాన్యానికి వార్నర్ భార్య కాండీస్ వార్నర్ కూడా చురకలు అంటించింది. ప్లేయిర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన అనంతరం.. కాండీస్ తన ట్వీట్‌లో ‘ఫాంలో లేడు.. వయసు అయిపోయింది. బాగా నెమ్మదించాడు.. కంగ్రాట్స్ వార్నర్’ అని ట్వీట్ చేసింది.
ఇది కచ్చితంగా సన్‌రైజర్స్‌ను టార్గెట్ చేస్తూ వేసిన ట్వీటే. కేవలం ఒక్క సీజన్ వైఫల్యానికే వార్నర్‌ను కెప్టెన్ పదవి నుంచి తొలగించడం మాత్రమే కాకుండా.. జట్టులో కూడా స్థానం లేకుండా చేశారు. కొన్ని మ్యాచ్‌లకు అయితే కనీసం స్టేడియంకు కూడా తీసుకువెళ్లలేదని స్వయంగా వార్నరే చెప్పాడంటే.. సన్‌రైజర్స్ వార్నర్‌ను ఎంత దారుణంగా ట్రీట్ చేసిందో చెప్పవచ్చు.
కాండీస్ వేసిన ట్వీట్ కింద ఫ్యాన్స్ కూడా ఆమెకు మద్దతు తెలుపుతూ రిప్లైలు ఇచ్చారు. సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు సరైన రిప్లై ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్‌కు ఏకంగా 57 వేల లైకులు రావడం విశేషం.
Out of form, too old and slow! 😳🤣 congratulations @davidwarner31 pic.twitter.com/Ljf25miQiM
— Candice Warner (@CandiceWarner31) November 14, 2021
— Satyajeet Gupta (@Satyajeetshere) November 15, 2021
Sunrisers Hyderabad Management be like: HELANA CHEYAKU BRO...
— Ardent NTR Fan (@ArdentNTRFan) November 15, 2021
— THENAMEISYASH07 (@ITzyash_07) November 14, 2021
@davidwarner31 ➡️ Form is temporary but Class is permanent 💛💚!! pic.twitter.com/trnuB4M12E
— Vishnu Hruday Adithya Muddapu (@MVishnuHruday) November 14, 2021
Also Read: T20 World Cup 2021: మీమ్ క్రియేటర్లకు షాక్..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!
Also Read: Rohit Sharma 264: ఆ ‘264’కు ఏడేళ్లు.. ఆ రోజు రోహిత్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి