T20 World Cup Prize Money: విశ్వవిజేతకు వచ్చింది ఇదే.. టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఎంతంటే?
టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా 14 సంవత్సరాల కల నెరవేరింది. ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. బౌలింగ్‌లో జోష్ హజిల్‌వుడ్ మంచి ప్రదర్శన కనపరచగా.. బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్, మిషెల్ మార్ష్ రాణించారు.
ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భారీ మొత్తంలో ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నాయి. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు 1.6 మిలియన్ డాలర్లు(సుమారు రూ.12 కోట్లు), రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు 8 లక్షల డాలర్లు(సుమారు రూ.6 కోట్లు) లభించింది. సెమీఫైనల్లో ఓడిపోయిన రెండు జట్లకు చెరో 4 లక్షల డాలర్లు(సుమారు రూ.3 కోట్లు) లభించాయి. సూపర్ 12 దశలో వెనుదిరిగిన జట్లకు 70 వేల డాలర్లు(సుమారు రూ.52 లక్షలు) అందించారు.
ఫైనల్ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేశాక డేరిల్ మిషెల్‌ను అవుట్ చేసి ఆస్ట్రేలియన్ బౌలర్లు మంచి ఆరంభాన్ని అందించారు. రెండో వికెట్ తీయడానికి 12వ ఓవర్ వరకు సమయం తీసుకున్నా.. స్కోరింగ్ రేట్ మాత్రం తక్కువగా ఉంచడంలో సఫలం అయ్యారు. కేన్ విలియమ్సన్ చెలరేగి ఆడినప్పటికీ న్యూజిలాండ్ 172-4కే పరిమితం కావడానికి కారణం ఇదే.
న్యూజిలాండ్ తరహాలోనే ఆస్ట్రేలియా కూడా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వికెట్‌ను ప్రారంభంలోనే కోల్పోయింది. అయితే ఈ ప్రభావం బ్యాటింగ్‌పై ఏమాత్రం పడకుండా డేవిడ్ వార్నర్, మిషెల్ మార్ష్ బాగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 9.5 ఓవర్లలోనే 92 పరుగులు జోడించారు.
38 బంతుల్లోనే 53 పరుగులు సాధించి బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అయితే మిషెల్ మార్ష్ మాత్రం 50 బంతుల్లో 77 పరుగులు సాధించి మ్యాచ్ ముగిసేదాకా వికెట్‌ను అస్సలు ఇవ్వలేదు. మార్ష్, మ్యాక్స్‌వెల్ కలిసి మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. 2022 అక్టోబర్, నవంబర్‌ల్లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
Also Read: Candice Warner on Twitter: హేళన చేయకు బ్రో.. సన్‌రైజర్స్‌కు సరైన రిప్లై ఇచ్చిన వార్నర్ భార్య
Also Read: T20 World Cup 2021: మీమ్ క్రియేటర్లకు షాక్..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!
Also Read: Rohit Sharma 264: ఆ ‘264’కు ఏడేళ్లు.. ఆరోజు రోహిత్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి