మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి
నిగమ్ బోధ్ ఘాట్‌లో భారత మాజీ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, నవ భారత నిర్మాత మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్ని కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. ఆశ్రు నయనాలతో మాజీ ప్రధాని మన్మోహన్‌కు పార్టీలకు అతీతంగా నేతలు కడసారి వీడ్కోలు పలికారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, తదితరులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ ప్రముఖులు మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగమ్ బోధ్ వరకు మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర నిర్వహించారు. అంత్యక్రియలు నిర్వహించిన నిగబ్ బోధ్ ఘాట్‌లో స్మారకం నిర్మించాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు..మరోసారి మన్మోహన్ సేవల్ని గుర్తు చేసుకున్నారు.