అన్వేషించండి
Advertisement
World's Richest Country: అమెరికాకు షాక్!! అత్యంత సంపన్న దేశంగా చైనా.. 20 ఏళ్లలోనే యూఎస్‌ను వెనక్కినెట్టిన డ్రాగన్
భయపడ్డట్టే జరిగింది! అమెరికాను చైనా వెనక్కినెట్టేసింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అవతరించింది. మెక్‌కిన్సే ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది.
సంపద సృష్టిలో చైనా రికార్డులు సృష్టిస్తోంది! 20 ఏళ్లలోనే అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టేసింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అవతరించింది. ఇక గడిచిన రెండు దశాబ్దాలలో ప్రపంచ సంపద మూడు రెట్లు పెరిగింది.
పది అత్యంత సంపన్న దేశాల ఆస్తి, అప్పుల పట్టీలను మెక్‌కిన్సే అండ్ కో పరిశీలించి నివేదికను వెల్లడించింది. మొత్తం సంపదలో 60 శాతం వీరిదే. 'మనం ఇంతకు ముందెన్నడూ లేనంత సంపన్నులం తెలుసా' అని మెక్‌కిన్సే ప్రతినిధి జాన్ మిస్‌చెక్ అంటున్నారు.
నివేదిక వివరాలు ఇవే
- ప్రపంచ సంపద 2000లో 156 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2020కి 514 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.
- చైనా 1999లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో చేరింది.
- 2000లో 7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న చైనా సంపద 2020కి 120 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
- అగ్రరాజ్యం అమెరికా సంపద ప్రస్తుతం 90 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
- జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- చైనా, అమెరికాలోని మొత్తం సంపదలో 2/3వ వంతు కేవలం పదో వంతు మందివద్దే ఉంది.
- నివేదిక ప్రకారం 68 శాతం నెట్‌వర్త్ స్థిరాస్తి రూపంలోనే ఉంది.
- మిగతా సంపద మౌలిక సదుపాయాలు, మెషినరీ, ఇతర ఆస్తులు, ఇన్వెంటరీ, ఇన్‌టాంజిబుల్స్ రూపంలో ఉంది.
- ఈ లెక్కల్లోకి ఆర్థిక ఆస్తులు (ఫైనాన్షియల్ అసెట్స్)ను తీసుకోలేదు.
- రెండు దశాబ్దాల్లోనే పెరిగిన సంపదతో అంతర్జాతీయ జీడీపీ తగ్గింది!
- ప్రాపర్టీ ధరలు పెరగడం, వడ్డీ రేట్లు తగ్గడం వల్లే ఎక్కువ సంపద పెరిగింది.ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా ధరల రూపంలో నెట్‌వర్త్ పెరగడం ప్రశ్నార్థకమే!
- స్థిరాస్తి ధరలు పెరగడంతో అందరికీ అందుబాటులో ఇళ్లు దొరకవన్న భయం నెలకొంది.
- 2008 తరహాలో ఇది ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది.
Also Read: PM Modi Crypto Meeting: క్రిప్టో కరెన్సీపై మోదీ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం!
Also Read: Financial Lessons for Kids: మీ పిల్లలకు ఈ 6 'డబ్బు' పాఠాలు నేర్పండి!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion