By: ABP Desam | Updated at : 14 Nov 2021 01:36 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఆర్థిక పాఠాలు
ఈ ప్రపంచంలో పిల్లలను ప్రేమించని తల్లిదండ్రులు ఉండరు! అందుకే వారు ఎంత అల్లరి చేసినా భరిస్తారు. ఇంకా ఇంకా ప్రేమిస్తారు! వారిని ప్రయోజకులను చేసేందుకు ఎంతో కష్టపడతారు. అడిగిందల్లా ఇస్తుంటారు. చిన్నారులను గారాంబం చేసే తల్లిదండ్రులే గురువులుగా మారి వారికి ఆర్థిక పాఠాలు బోధించాలని నిపుణులు అంటున్నారు. కనీసం ఈ ఆరు ఆర్థిక పాఠాలను వారికి నేర్పించాలని చెబుతున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా అవి మీ కోసం..!
విలువ నేర్పండి
డబ్బులు ఊరికే రావన్న సత్యాన్ని పిల్లలకు బాల్యంలోనే నేర్పించాలి. ఎంతో కష్టపడితేనే ధనం ముడుతుందని చెప్పాలి. డబ్బు, కష్టం విలువను వారికి బోధించాలి. అందుకే అడిగిందల్లా వారికి ఇవ్వకూడదు. మీ పిల్లల వయసు 8-10 ఏళ్లు ఉంటే ఇలా చేయండి. ఇంట్లో పనుల్లో మీకు సాయపడితే డబ్బులు ఇస్తామని చెప్పండి. వారు చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తే మీరు ఎంతవ్వాలని అనుకున్నారో అంత ఇవ్వండి. బాధ్యతల్లో నిర్లక్ష్యం వహిస్తే నిర్దాక్షిణ్యంగా ఇవ్వాల్సిన దాంట్లో కోత పెట్టండి. అప్పుడు కష్టపడితేనే డబ్బులొస్తాయని అర్థమవుతుంది.
వృథా ఆపండి
చిన్నారులకు డబ్బును సరిగ్గా ఖర్చుపెట్టడం బోధించాలి. ఎందుకంటే ఈ కాలంలో డబ్బును వృథాగా ఖర్చుచేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. 'ఏది ఇష్టమో కాకుండా ఏది అవసరమో' నేర్పించాలి. ఉదాహరణకు షాపులోకి తీసుకెళ్లగానే రంగురంగుల పెన్సిళ్ల డబ్బా నచ్చిందనుకోండి. వెంటనే కొనివ్వద్దు. అదే పని అంతకన్నా తక్కువ ధరలో వస్తున్న మంచి పెన్సిళ్లు చేస్తే వాటినే కొనివ్వండి. ధరను బట్టి కాకుండా విలువను బట్టి కొనుగోళ్లు చేపట్టాలని నేర్పించండి.
సేవింగ్స్ నేర్పండి
'ఒక రూపాయి దాచుకోవడం ఒక రూపాయి సంపాదించుకోవడమే' అని ఎప్పట్నుంచో ఉన్నదే! కానీ ఎప్పటికీ అదే నిజమైనది. అందుకే పిల్లలకు డబ్బును ఆదా చేసుకోవడం నేర్పించాలి. ఒక పిగ్గీ బ్యాంకును ఏర్పాటు చేసి సేవింగ్స్ అలవాటు చేయించాలి. వారు పెరిగి పెద్దయ్యాకా ఇది ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు మీ ఇంటి బడ్జె్‌ట్ లెక్కలను వారికి వివరిస్తుండాలి. భారీ మొత్తంలో సొమ్ము కూడబెట్టి దాంతో విలువైన వస్తువులు కొనుక్కొనేలా నేర్పించండి. కాస్త పెదయ్యాక సేవింగ్స్ బ్యాంకు ఖాతా తెరవండి.
డబ్బు పెరిగే మార్గాలు చెప్పండి
వారెన్ బఫెట్ పదకొండేళ్ల వయసులోనే స్టాక్‌మార్కెట్లో ట్రేడింగ్ చేయడం మొదలు పెట్టారు. ఆర్థిక ఎదుగుదల, సంపద సృష్టికి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి తప్పనిసరి. అందుకే వారికి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్ల గురించి వారి స్థాయికి తగినట్టుగా వివరిస్తుండాలి. వాటిని పరిచయం చేస్తుండాలి. ఎంత ఇన్వెస్ట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఎంతొస్తుంది వంటి విషయాలు చర్చిస్తుండాలి. వారి చేతే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటివి చేయిస్తుంటే పాసివ్ ఇన్‌కమ్ గురించి అర్థమవుతుంది.
డబ్బు విలువ తగ్గుదల
కాలం గడిచే కొద్దీ డబ్బు విలువ తగ్గుతుందని పిల్లలకు నేర్పించాలి. ఇప్పటి రూపాయి విలువ మరో ఐదేళ్లకు తగ్గిపోతుందని వారికి చెప్పాలి. ద్రవ్యోల్బణం వంటివి వివరించాలి. ఉదాహరణకు పదేళ్ల క్రితం ఒక పెన్సిల్ లేదా ఏవైనా నోట్‌బుక్‌లు ఎంత ధర ఉండేవి ఇప్పుడెంత పెరిగాయో చెప్పాలి. అప్పుడు తక్కువకే దొరికిన వస్తువులు ఇప్పుడెందుకు ఖరీదు పెరిగాయో చెబితే వారికి డబ్బు విలువ అర్థమవుతుంది.
దాతృత్వం అలవాటు చేయండి
సంపాదించిన మొత్తంలో తోచిన మేరకు దానం చేయడం నేర్పించాలి. దానివల్ల కలిగే సంతృప్తి వారికి వివరించాలి. బాల్యం నుంచే దాతృత్వం గురించి నేర్పితే పెద్దయ్యాక వారు మంచి మనుషులుగా మారతారు. మంచి వ్యక్తిత్వం అలవాటు అవుతుంది. సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే స్పృహ ఏర్పడుతుంది.
Also Read: MobiKwik RuPay Card: మొబిక్విక్ రూపే కార్డు.. ముందే రూ.30వేలు వాడేసుకోవచ్చు..! మరెన్నో ఆఫర్లు..!
Also Read: Honda New SUV: హోండా కొత్త ఎస్‌యూవీలు త్వరలో.. ఈ విభాగంలో బెస్ట్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
GHMC Property Tax: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు